Beauty packs
-
పొడిబారిన చర్మానికి...
చలికాలం చర్మం త్వరగా పొడిబారుతుంది. చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారాలంటే వంటింట్లో ఉండే దినుసులతోనే బ్యూటీ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. ∙బియ్యాన్ని నానబెట్టి, బాగా కడిగి.. ఆ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు రాస్తూ మృదువుగా మసాజ్ చేయాలి. పొడిబారి నిస్తేజంగా మారిన చర్మం తాజాగా మారుతుంది. రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం ముడతలు పడటం కూడా తగ్గుతుంది. ∙మూడు 3 టేబుల్ స్పూన్ల పిండిలో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కొబ్బరి నూనె, 6 చుక్కల నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అర గంట లేదంటే పూర్తిగా ఆరేదాకా ఉంచి శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు రోజూ కూడా ఈ ప్యాక్ను వేసుకోవచ్చు. ∙మొటిమలు, యాక్నె సమస్య ఉన్నవారు దాల్చిన చెక్కను పొడి చేసి, దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. యాక్నె సమస్య తగ్గుతుంది. చర్మం కాంతిమంతం అవుతుంది. -
నిగారింపు కోసం... పోషకాలు
అందంగా ఉండాలంటే ఎవరైనా ప్రామాణికంగా తీసుకునేది చర్మ సౌందర్యాన్నే! చర్మపు నిగారింపు పెరగాలంటే బ్యూటీ ప్యాక్లు, మసాజ్లతో పాటు తీసుకునే ఆహారం పైనా శ్రద్ధ పెట్టాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోస, ద్రాక్ష, కమలా... వంటి పండ్లను, రసాలను తీసుకోవాలి. వీటిలో ఉండే ఔషధ గుణాలు... సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల దాడిని అడ్డుకుంటాయి. ఫలితంగా చర్మ సౌందర్యం దెబ్బతినదు కాలానుగుణంగా వచ్చే మామిడిపండ్లలో 20 రకాల విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. మామిడిపండులో ఉండే సహజసిద్ధ గుణాలు బీటా-సి, విటమిన్ ‘ఎ’లు కణాలను ఉత్తేజపరచడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన చర్మకణాలు కాంతిని పెంచుతాయి క్యారెట్లు కంటిచూపును మెరుగుపరుస్తాయని చాలామందికి తెలుసు. పొడిచర్మాన్ని మృదువుగా మార్చే సుగుణాలు క్యారెట్లో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ చర్మానికి సహజసిద్ధ నూనెలు అందించేందుకు సహాయపడుతుంది. ఫలితంగా చర్మకాంతి మెరుగుపడుతుంది.