పొడిబారిన చర్మానికి... | Beauty tips: special Oatmeal pack | Sakshi
Sakshi News home page

పొడిబారిన చర్మానికి...

Published Wed, Nov 28 2018 12:18 AM | Last Updated on Wed, Nov 28 2018 12:18 AM

Beauty tips: special Oatmeal pack  - Sakshi

చలికాలం చర్మం త్వరగా పొడిబారుతుంది. చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారాలంటే వంటింట్లో ఉండే దినుసులతోనే బ్యూటీ ప్యాక్స్‌ తయారుచేసుకోవచ్చు.  
 
∙బియ్యాన్ని నానబెట్టి, బాగా కడిగి.. ఆ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు రాస్తూ మృదువుగా మసాజ్‌ చేయాలి. పొడిబారి నిస్తేజంగా మారిన చర్మం తాజాగా మారుతుంది. రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం ముడతలు పడటం కూడా తగ్గుతుంది. 

∙మూడు 3 టేబుల్‌ స్పూన్ల పిండిలో పావు టీ స్పూన్‌ పసుపు, అర టీ స్పూన్‌ కొబ్బరి నూనె, 6 చుక్కల నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అర గంట లేదంటే పూర్తిగా ఆరేదాకా ఉంచి శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు రోజూ కూడా ఈ ప్యాక్‌ను వేసుకోవచ్చు.

∙మొటిమలు, యాక్నె సమస్య ఉన్నవారు దాల్చిన చెక్కను పొడి చేసి, దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. యాక్నె  సమస్య తగ్గుతుంది. చర్మం కాంతిమంతం అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement