
నిద్రలేమి, అలసటతో కళ్ల చుట్టూ వచ్చే నల్లటి వలయాలను తొలగిస్తుంది.. లిప్ స్టిక్ వాడకం, డీహైడ్రేషన్ వంటి కారణాలతో పెళుసుగా మారిన పెదవులను తేమగా ఉంచుతుంది ఈ మినీ డివైజ్(ఐ, లిప్స్ కేర్ మసాజర్). మినీ స్కిన్ లిఫ్టింగ్ యాంటీ రింకిల్స్ రిమూవర్ పెన్.. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ముడతలు, మచ్చలను తొలగిస్తుంది.
ఇది 42 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్‌తో సున్నితమైన భాగాలకు ఎలాంటి హానీ కలగకుండా ట్రీట్మెంట్ ఇస్తుంది. దీనికి ఒక గంట చార్జింగ్ పెడితే నాలుగు గంటలపైనే నిర్విరామంగా పనిచేస్తుంది. హై ఫ్రీక్వెన్సీ మైక్రో–వైబ్రేషన్ టెక్నాలజీతో నిమిషానికి 12వేల సార్లు వైబ్రేట్ అవుతుంది.
ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఒకే ఒక్క బటన్ ఉంటుంది. దాంతో దీన్ని వినియోగించడం చాలా సులభం. ఆన్ అయినప్పుడు మసాజ్ హెడ్ కింద రెడ్/బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది. ఈ డివైజ్‌ని వాడటం వల్ల చర్మ కణాల్లో రక్తప్రసరణ చక్కగా అవుతుంది.
వృద్ధాప్య ముడతలు పోతాయి. అలసటను దూరం చేస్తుంది. ఏ కారణం చేతైనా ఈ పెన్‌ను ఆఫ్ చెయ్యడం మరచిపోతే.. రెండు నిమిషాల తర్వాత ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. దీన్ని సులభంగా మేకప్ కిట్‌లో వేసుకుని ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. భలే బాగుంది కదూ.
చదవండి: స్నాక్స్ విత్ టీ ఆర్ కాఫీ: పైన నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్.. పక్కనే కెటిల్.. ధర రూ.5,212!
Comments
Please login to add a commentAdd a comment