
Allari Subhashini : అల్లరి సినిమాతో లేడీ కమెడియన్‌గా గుర్తింపు పొందిన నటి సుభాషిణి. ఆ సినిమాతో అల్లరి సుభాషిణిగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల్లో నటించని సుభాషిణి ఇటీవలె ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తనకు క్యాన్సర్ వచ్చిందని, ఆ సమయంలో కేసీఆర్ తనకు సహాయం చేశారని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యింది.
'అనారోగ్య సమస్యలు ఎదురు కావడంతో ఓసారి హాస్పిటల్‌కి వెళ్లి పరీక్షలు చేయిస్తే క్యాన్సర్ అని తేలింది. చికిత్సకు దాదాపు 15 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రగతిభవన్‌కు వెళ్లి సహాయం చేయమని కోరాను. కేసీఆర్ గారు స్పందించి వెంటనే 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా ఆపరేషన్ జరిగింది.
ఇందుకు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సైతం తనకు లక్ష రూపాయలు సహాయం చేశారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు కూడా ఆర్థిక సహాయం అందించారు. ఆరోగ్య పరంగా కోలుకున్నాను. ప్రస్తుతం ఆఫర్లు వస్తున్నాయి త్వరలోనే సినిమాల్లో నటిస్తాను అని పేర్కొంది.
చదవండి :నిధి అగర్వాల్‌కు ‘హరి హర వీరమల్లు' సర్‌ప్రైజ్
చెల్లితో పాటు భర్తను కూడా సినిమాల్లోకి తీసుకొస్తున్న కాజల్!