ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి మార్ ముంత.. చోడ్ చింత అనే సాంగ్ రిలీజైంది. ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వాయిస్‌ను ఉపయోగించారు. ఏం జేద్దామంటవు మరి? అనే డైలాగ్‌ను యథాతథంగా వాడేశారు. దీన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్రంగా విమర్శించారు.
మీమ్స్ నుంచి..
ఈ పాట చిత్రీకరణ అంతా కల్లు కాంపౌండ్‌లోనే జరుగుతుంది. ఇలాంటి మందు పాటలో కేసీఆర్ డైలాగ్ ఎలా వాడతారని మండిపడ్డారు. తాజాగా ఈ వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ వివరణ ఇచ్చాడు. 'కేసీఆర్ గారు గొప్ప వ్యక్తి. ఆయన మనందరికీ ఫేవరెట్.. ఆయన్ను చాలా మీమ్స్‌లో చూస్తుంటాం. అలా మీమ్స్‌లో నుంచి ఆ డైలాగ్ తీసి వాడాం. ఎంజాయ్.. పండగ అనేది కూడా మీమ్స్ నుంచి తీసిన డైలాగే..
ఐటం సాంగ్ కాదు
ఈ అల్టిమేట్ సాంగ్‌లో కేసీఆర్ డైలాగ్ పెడితే బాగుంటుందనుకున్నాం. అంతే తప్ప ఆయన్ను కించపరచాలని కాదు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే చేశాం. దయచేసి దీన్ని తప్పుగా తీసుకోకండి. పైగా ఇది ఐటం సాంగ్ కాదు, హీరోహీరోయిన్లు కలిసి చేసే డ్యూయెట్ సాంగ్' అని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment