Suma Kanakala: Actress Subhashini Emotional Words About Anchor Went Viral - Sakshi
Sakshi News home page

Anchor Suma-Actress Subhashini: సుమ వల్లే నేను ఇలా ఉన్నాను: నటి ఎమోషనల్‌

Published Mon, Jul 11 2022 1:57 PM | Last Updated on Mon, Jul 11 2022 3:19 PM

Suma Kanakala Helps Actress Subhashini For Her Health Video Goes Viral - Sakshi

బుల్లితెరపై యాంకర్‌ సుమ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె షో అంటే కంటెస్టెంట్స్‌కే కాదు ప్రేక్షకుల్లో సైతం జోష్‌ వస్తుంది. తనదైన పంచ్‌లు, వాక్‌చాతుర్యంతో అందరిని అబ్బురపరుస్తుంది సుమ. మైక్‌ పట్టుకుంటే చాలు గలగల మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే టీవీ షోలే కాదు స్టార్‌ హీరోల మూవీ ఈవెంట్స్‌, ప్రీ-రిలీజ్‌, ప్రమోషన్స్‌ అంటే సుమ లేకుండ అవి ఉండవు. ఇలా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ పలు సేవ కార్యక్రమాలు చేపడుతూ గొప్ప మనసు చాటుకుంటోంది. 

చదవండి: సుమ వల్లే నేను ఇలా ఉన్నాను: నటి ఎమోషనల్‌

ఇందుకు తాజా సంఘటనే ఉదాహరణ. ఆమె హోస్ట్‌ చేస్తున్న ఓ షోలో సీనియర్‌ నటి సుభాషిని అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమ లేకపోతే తాను ఇప్పుడు ఇలా మీ ముందు ఉండేదానిని కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే సుమనే కారణం. ఎంతో కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న. వైద్యంగా కోసం సుమ ఆర్థికంగా సహాయం చేస్తుంది. నాకు ఆరు నెలలకు ఒకసారి మెడిసిన్స్ పంపిస్తుంది సుమ.

చదవండి: ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్‌ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

మళ్లీ నాకు మానవ జన్మ ఉంటే నువ్వు నా కడుపున పాపగా పుట్టాలి. బంగారు తల్లివమ్మా నువ్వు’ అని అనడంతో సుమ కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. వెంటనే నటి సుభాషిని దగ్గరకు వెళ్లి ఆమెను హత్తుకుంది. ఇలా ఇద్దరు కన్నీళ్లు పెట్టుకోవడం స్టేజ్‌పై ఒక్కసారిగా సైలెంట్‌ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘సుమ తన మాటలతో అందరిని మన్ననలు పొందడమే కాదు.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ గొప్ప వ్యక్తిగా ప్రూవ్‌ చేసుకున్నారు’ అంటూ ఫ్యాన్స్‌  ప్రశంసలు కురిపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement