
సాక్షి, హైదరాబాద్ : ‘అల్లరి’ సినిమాతో ప్రసిద్ధి పొందిన సీనియర్ నటి సుభాషిణీ తీవ్ర కష్టాల్లో ఉన్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఆమె కష్టాల గురించి తెలుసుకున్న సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆమె అనారోగ్యం గురించి తెలుసుకొని.. రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ బుధవారం స్వయంగా సుభాషిణి ఇంటికి వెళ్లి.. ఆమెకు రూ. రెండు లక్షలు అందజేశారు. కష్టాల్లో ఉన్న సీనియర్ నటికి చిరంజీవి సాయం అందించడంపై సోషల్ మీడియాలో పలువురు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment