Mahesh Babu Promotes Sarkaru Vaari Paata On Twitter With '#WhatsHappening' - Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్‌ తనకు ఎలాంటి హ్యాష్‌ ట్యాగ్ ఇచ్చుకున్నాడో తెలుసా?

Published Wed, May 11 2022 12:03 PM | Last Updated on Wed, May 11 2022 12:59 PM

Mahesh Babu Promotes Sarkaru Vaari Paata On Twitter With WhatsHappening - Sakshi

Mahesh Babu What's Happening Video Goes Viral: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట మే 12న విడుదల కాబోతోంది. పరశురామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్‌ మే 12వ తేదీ కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు. మూవీ రిలీజ్‌ దగ్గరపడుతుండటంతో ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు మహేశ్‌. ఇందుకోసం ఆయన ట్విటర్‌లో సైతం మూవీని ప్రమోట్‌ చేస్తున్నాడు.  ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్‌ సంచలన వ్యాఖ్యలు

తాజాగా వాట్స్‌ హ్యాపెనింగ్‌ అంటూ ట్విటర్‌లో మహేశ్‌ ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్‌ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. మీ గురించి హ్యాష్‌ ట్యాగ్‌ రూపంలో ఎలా చెప్పుకుంటారు అని అడగ్గా ‘కామ్‌ అండ్‌ ఫోకస్డ్‌(Calm And Focused)’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ఒక ఎమోజీతో మిమ్మల్ని మీరు వివరించుకోవాలంటే?.. స్మైలీ(Smiley) ఎమోజీతో పోల్చుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత ట్విటర్‌లో ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నారని ప్రశ్నంచగా.. ‘నా భార్యకు (నమ్రత శిరొద్కర్‌) ట్విటర్‌ ఖాతా ఉంటే బాగుండేది.. తననే ఫాలో అయ్యేవాడిని’ అన్నాడు. ట్విటర్‌లో ఇప్పటి వరకు మీరు అందుకున్న అంత్యంత ఫన్నీ డీఎమ్‌(DM) ఏంటి? అని అడగ్గా.. ‘నిజానికి నా డీఎమ్‌ లాక్‌ చేయబడింది.. దాన్ని ఓపెన్‌ చేయమంటారా?’ అన్నాడు.

చదవండి: ‘ద పీకాక్‌’ మ్యాగజైన్‌పై మహేశ్‌, ఫొటో షేర్‌ చేసిన సూపర్‌ స్టార్‌

ట్విటర్‌లో ఏడిట్‌ ఆప్షన్‌ కావాలా?వాద్దా? అన్నదానికి.. ఖచ్చితంగా కావాలి అని బదులిచ్చాడు. ఇక మీరు నటించిన ఒక్కడు సినిమాలో ఏ క్యారెక్టర్‌ను ఫాలో అవుతారు? మ్యూట్‌ చేస్తారు? బ్లాక్‌ చేస్తారు? అని అడిగిన ప్రశ్నకు.. స్వప్న(భూమిక) పాత్రను ఫాలో అవుతా.. నాకు తండ్రిగా నటించిన ముకేశ్‌ రిషిని మ్యూట్‌ చేస్తా.. ఓబుల్‌రెడ్డిని(ప్రకాశ్‌ రాజ్‌)బ్లాక్‌ చేస్తానంటూ మహేశ్‌ చెప్పుకొచ్చాడు. చివరిగా సర్కారు వారి పాట గురించి ట్వీట్‌లో ఒక్కమాటలో చెప్పాలంటే?.. ‘ఈ వేసవికి నా అభిమానులు సర్కారు వారి పాటను బ్లాస్ట్‌ చేస్తారని ఆశిస్తున్నా’ అంటూ జవాబు ఇచ్చాడు. ఇలా మహేశ్‌ నవ్వుతూ.. సరదాగా ఇచ్చిన ఈ సమాధానాలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement