
తండ్రి మరణాన్ని తట్టుకోలేక సూపర్ స్టార్ మహేశ్ బాబు కన్నీటి పర్యంతం అయ్యారు. కాసేపటి క్రితమే హాస్పిటల్ నుంచి కృష్ణ పార్థివదేహం నానక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహానికి చేరుకుంది. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమాలను భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక సినీ ప్రముఖులు సైతం ఆయన నివాసానికి చేరుకుని కృష్ణ భౌతికఖాయానికి నివాళులు అర్పిస్తున్నారు. అనంతరం ఆయన తనయుడు మహేశ్ బాబును ఇతర కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
చదవండి: సూపర్ స్టార్ కృష్ణ మృతి.. స్పందించిన ఘట్టమనేని కుటుంబం
ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర రావు పరామర్శిస్తున్న క్రమంలో మహేశ్ ద:ఖం ఆపుకోలేకపోయారు. తండ్రిని తలుచుకుని ఆయన కన్నీరు పెట్టుకున్న దృశ్యం అక్కడి వారితో పాటు అభిమానులను హత్తుకుంటోంది. మహేశ్ ఏడుస్తుంటే రాఘవేంద్రరావు ఆయనకు ధైర్యం చెబుతూ ఓదార్చారు. కాగా ఏడాది వ్యవధిలోనే తండ్రి, తల్లి, సోదరుడిని కొల్పోయిన మహేశ్ తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. ఇక ఈ వీడియోపై మహేశ్‌కు అభిమానులు స్పందిస్తూ ఆయనకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment