Superstar Krishna and Mahesh Babu Edit Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Superstar Krishna: ఒకే వీడియోలో సూపర్ స్టార్ కష్ణ, మహేశ్ బాబు.. సోషల్ మీడియాలో వైరల్

Published Sat, Nov 19 2022 7:05 PM | Last Updated on Sat, Nov 19 2022 8:41 PM

Superstar Krishna and Mahesh Babu Edit Video Goes Viral On Social Media - Sakshi

సీనియర్ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల టాలీవుడ్ మొత్తం ఘననివాళి అర్పించింది. 350కి పైగా చిత్రాల్లో నటించిన నటశేఖరుడికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం నివాళులర్పించారు. నిర్మాతల నటుడిగా ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన సూపర్ స్టార్ కృష్ణ సినీప్రస్థానం ఓ చరిత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రముఖ నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. కృష్ణను కడసారి చూసేందుకు వచ్చిన వేల మంది అభిమానులను చూసి యావత్ సినీ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సీనియర్ నటుడు మోహన్‌ బాబు కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉంది. 

అయితే తాజాగా మహేశ్ అభిమానులు ఎడిట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దివంగత సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు నటించిన సినిమాల్లోని సన్నివేశాలతో ఓ ఆసక్తికర వీడియో రూపొందించారు. ఆనాటి చిత్రాల్లోని సన్నివేశాలతో మహేశ్ బాబు నటించిన వాటిని కలిపి చేసిన ఎడిట్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో మహేశ్‌ తన తండ్రి గురించి చెప్పిన మాటలు ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తండ్రీ, కొడుకులను ఒకేసారి చూడటానికి మీ రెండు కళ్లు చాలవంటే నమ్మండి. అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement