SSMB28: Trivikram Srinivas playing cricket on the sets, video goes viral - Sakshi
Sakshi News home page

SSMB28-Trivikram Srinivas: SSMB28 సెట్‌లో టైంపాస్‌ చేస్తున్న త్రివిక్రమ్‌.. ఫ్యాన్స్‌ అసహనం!

Published Sat, Feb 4 2023 9:52 AM | Last Updated on Sat, Feb 4 2023 10:45 AM

SSMB28: Trivikram Srinivas Plays Cricket in Movie Shooting Set - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ తెరకెక్కిస్తున్న మూవీ ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. పలు వాయిదాల అనంతరం జనవరిలో ఈ మూవీ రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసింది. ఈ మూవీని ప్రకటించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ లేటు అయ్యిందని, ఎప్పడు పూర్తి చేస్తారంటూ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ సెట్‌ త్రివిక్రమ్‌ టైంపాస్‌ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

చదవండి: సినిమా రంగంలోకి రాని విశ్వనాథ్‌ వారసులు.. ఎందుకంటే

దీనిపై మహేవ్‌ ఫ్యాన్స్‌ కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఎప్పుడూ పనితో బిజీగా ఉండాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28 సెట్‌లో యాక్షన్‌, కట్‌ అంటూ మైక్‌ పట్టుకోవాల్సిన ఆయన బ్యాట్‌ పట్టుకుని కనిపించాడు. మూవీ టీంతో కలిసి క్రికెట్‌ ఆడాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న మూవీ షూటింగ్‌ సెట్‌లో కాస్తా బ్రేక్‌ తీసుకుని టీంతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడాడు త్రివిక్రమ్‌. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ‘రంగస్థలం’ మహేశ్‌తో పాటు ఇతర సహాయ నటీనటులు కనిపించారు.

చదవండి: వామ్మో.. చిరు వాడే వాచ్‌ అంత కాస్ట్‌లీనా! ధరెంతో తెలుసా?

కాగా ఈ చిత్రంలో మహేశ్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా. ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల మరో హీరోయిన్‌గా చేయనుంది. అలాగే హీరోయిన్ సంయుక్త మీనన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. గతంలో త్రివిక్రమ్, మహేష్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం వీరిద్దరూ కూడా సక్సెస్ ట్రాక్‌లో ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement