టాలీవుడ్ ప్రిన్స్ దీపావళి సర్‌ప్రైజ్.. సితార అదిరిపోయే ఫర్మామెన్స్ | Mahesh Babu Daughter Sitara Classical Dance On Diwali Occassion | Sakshi
Sakshi News home page

Mahesh Babu Daughter Sitara: సితార క్లాసికల్ డ్యాన్స్.. కూతురిని ప్రశంసలతో ముంచెత్తిన మహేశ్ బాబు

Published Mon, Oct 24 2022 7:15 PM | Last Updated on Mon, Oct 24 2022 9:07 PM

Mahesh Babu Daughter Sitara Classical Dance On Diwali Occassion - Sakshi

టాలీవుడ్ ప్రిన్స్‌ మహేశ్ బాబుకు తన గారాల పట్టి సితార అంటే పిచ్చి ప్రేమ. తండ్రితో కలిసి సితార ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు. తాజాగా ఇవాళ దీపావళిని పురస్కరించుకుని చేసిన షేర్‌ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలా కాకుండా కాస్త భిన్నంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు.  

 దీపావళి సందర్భంగా సితార క్లాసికల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టింది. దీనికి సంబంధిత ఆ వీడియోను పోస్ట్‌ చేస్తూ అభిమానులందరికీ విషెస్ తెలిపింది. తన గురువు మహతీ భిక్షుతో కలిసి నృత్యం చేయటం చాలా సంతోషంగా ఉందని సితార తెలిపింది.  ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు సితార డ్యాన్స్‌ను మెచ్చుకుంటున్నారు. తన కూతురు సితార డ్యాన్స్‌ చేసిన వీడియోను మహేశ్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 

(చదవండి: ఆ సినిమా బాహుబలి కంటే హిట్‌ అయ్యేది.. ఆర్జీవీ ట్వీట్ వైరల్)

మహేశ్ బాబు తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను గర్వపడేలా చేయటంలో నువ్వు ఎప్పుడూ ఫెయిల్ కావు. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగించు చిట్టి తల్లి. నీకు నేర్పిన గురువులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ' అంటూ కితాబిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సితారకు ఫ్యాన్స్  కంగ్రాట్స్ చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement