ACs
-
ఏసీల డిమాండ్ ఎలా ఉండనుందంటే..
కోల్‌కతా: ఉష్ణోగ్రతల్లో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో దేశంలో రూమ్ ఏసీల వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) పరిశ్రమ అసాధారణ వృద్ధిని చూడనుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 20–25 శాతం అధికంగా 1.2–1.25 కోట్ల రూమ్ ఏసీ యూనిట్లు అమ్ముడుపోవచ్చని పేర్కొంది. అంతేకాదు వచ్చే ఆర్థిక సంత్సరంలోనూ (2025–26) రూమ్ ఏసీల అమ్మకాలు 10–12 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడం, ఒక ఇంట్లోనే ఒకటికి మించిన గదుల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటుండటం, పట్టణీకరణ, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, సులభతర కన్జ్యూమర్ ఫైనాన్స్ (రుణాలపై కొనుగోలు) సదుపాయాలు... ఇవన్నీ వచ్చే కొన్నేళ్ల పాటు రూమ్ ఏసీల డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. ‘‘దేశీ రూమ్ ఏసీ పరిశ్రమ కరోనా ముందు నాటి విక్రయాల పరిమాణాన్ని 2023–24లోనే అధిగమించింది. వాతావారణంలో వచి్చన మార్పులు, సానుకూల వినియోగ ధోరణులు మద్దతుగా నిలిచాయి’’అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకుమార్ కృష్ణమూర్తి వివరించారు. ఏడాదిలో అధిక వేడి ఉండే సగటు రోజులు గడిచిన మూడు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది వేసవి సీజన్లో అయితే రూమ్ ఏసీలకు సంబంధించి కొన్ని కంపెనీలు (ఓఈఎంలు) 40–50 శాతం వరకు అధిక అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం. సామర్థ్యాల పెంపుపై దృష్టి.. ‘‘సరఫరా వైపు చూస్తే దేశీ రూమ్ ఏసీ సామర్థ్యం వచ్చే మూడేళ్లలో 40 శాతం పెరగనుంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఓఈఎంలు, కాంట్రాక్టు తయారీదారులు రూమ్ ఏసీల తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు’’అని కృష్ణమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ డ్యూరబుల్ విడిభాగాలకు పీఎల్ఐ పథకం కింద ప్రకటించిన ప్రయోజనాల ప్రభావాన్ని సైతం ఇక్రా నివేదిక గుర్తు చేసింది. రూమ్ ఏసీ పరిశ్రమలో స్థానిక తయారీ పెరగడానికి పీఎల్ఐ పథకం దోహదం చేసినట్టు తెలిపింది. మూడు లిస్టెడ్ రూమ్ ఏసీ కంపెనీలు జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 53 శాతం మేర ఆదాయ వృద్ధిని నమోదు చేయడాన్ని ప్రస్తావించింది. వేసవి సీజన్లో డిమాండ్ గరిష్ట డిమాండ్‌కు నిదర్శనంగా పేర్కొంది. ఈ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం మేర ఆదాయంలో వృద్ధిని సాధించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 25 శాతం అధిక ఆదాయాన్ని నమోదు చేస్తాయని ఇక్రా అంచనా వేసింది. తీవ్ర పోటీ, తయారీకి వినియోగించే విడిభాగాల ధరల్లో అస్థితరలు ఉన్నప్పటికీ.. రూమ్ ఏసీ కంపెనీల లాభాల మార్జిన్లు రానున్న కాలంలో క్రమంగా మెరుగుపడతాయని పేర్కొంది. -
హీట్ వేవ్స్.. హాట్ సేల్స్
అల్పపీడన ద్రోణి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. దీనికితోడు విపరీతమైన ఉక్కపోతతో జనం ‘చల్ల’దనం కోసం పరుగులు తీస్తున్నారు. ఇందుకోసం ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: సాధారణంగా వేసవి తరువాత ఏసీల అమ్మకాల్లో తగ్గుదల సహజం. కానీ సెప్టెంబర్ వస్తున్నా రికార్డు స్థాయిలో ఏసీల అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో తయారీ కంపెనీలు భారీ లాభాల బాట పడుతున్నాయి. ఈ వేసవిలో ఏసీ అమ్మకాల్లో 60 నుంచి 70 శాతం వృద్ధి నమోదు కాగా జూలై నుంచి జరుగుతున్న అమ్మకాల్లో కూడా 30 నుంచి 40 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) నెలల్లో పలు ఏసీ కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో లాభాలు రెండు రెట్లు పెరిగాయంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలకు భారీ లాభాలు అత్యధిక వాటా కలిగిన వోల్టాస్ లాభం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రెండు రెట్లు పెరిగి రూ.355 కోట్లకు చేరింది. ఈ మూడు నెలల కాలంలో వోల్టాస్ రికార్డు స్థాయిలో 10 లక్షల యూనిట్లు విక్రయించింది. బ్లూస్టార్ లాభం కూడా రెండు రెట్లు పెరిగి రూ.169 కోట్లకు చేరింది. గతేడాది రూ.62 కోట్ల నష్టాలను ప్రకటించిన హావెల్స్ ఈ ఏడాది రూ.67 కోట్ల లాభాలను ప్రకటించడం గమనార్హం. 2023లో దేశవ్యాప్తంగా 1.1 కోట్ల ఏసీల అమ్మకాలు జరిగితే 2024లో 1.5 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లియన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీమా) ప్రెసిడెంట్ సునిల్ వచాని తెలిపారు.ఆన్లైన్ రిటైల్ సంస్థల పోటీ ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌వంటి ఆన్లైన్ రిటైల్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోతున్నామంటూ కొన్ని కంపెనీలు వాపోతున్నాయి. 2037 నాటికి ప్రతి 15 సెకన్లకు ఒక ఏసీ 2011 తర్వాత ఈ స్థాయిలో ఏసీల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారని, 2037 నాటికి ప్రతీ 15 సెకన్లకు ఒక ఏసీ విక్రయించే స్థాయికి ఇండియా ఎదుగుతుందని ప్రపంచబ్యాంకు అంచనా వేస్తోంది. 95 శాతం తొలిసారి కొంటున్నవారే దేశవ్యాప్తంగా వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో వినియోగదారులు ఏసీలు, రిఫ్రిజరేటర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని, ఇప్పుడు ఏసీ అన్నది లగ్జరీ సాధనంగా కాకుండా బతకడానికి తప్పనిసరి వస్తువుగా మారిపోయిందని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశంలో సొంత ఏసీ వినియోగం చాలా తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం కుటుంబాల్లో కేవలం 8 శాతం మందికి మాత్రమే సొంత ఏసీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున చల్లదనం కోసం ప్రతీ వ్యక్తి 272 కేడబ్ల్యూహెచ్ విద్యుత్‌ను వినియోగిస్తుంటే, మన దేశంలో అది కేవలం 69 కేడబ్ల్యూహెచ్‌గా ఉంది. ఈ ఏడాది తమ సంస్థ అమ్మిన ఏసీల్లో 95 శాతం మంది తొలిసారిగా కొన్నవారే ఉన్నారని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. ఇందులో 65 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉన్నారు. -
క్యాన్సర్ కణాలకు చెక్!
న్యూఢిల్లీ: మహమ్మారి క్యాన్సర్ కణాల అంతానికి నడుం బిగించిన భారతీయ శాస్త్రవేత్తల బృందం ఆ క్రతువులో విజయవంతమైంది. అతి సూక్ష్మ బంగారు, రాగి సలై్ఫడ్ రేణువులను శాస్త్రవేత్తలు సృష్టించారు. రోగి శరీరంలో క్యాన్సర్ సోకిన చోట ఈ రేణువులను ప్రవేశపెట్టి వీటిని ఫొటో థర్మల్, ఆక్సీకరణ ఒత్తిడికి గురిచేసినపుడు ఇవి క్యాన్సర్ కణాలను విజయవంతంగా వధించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)కి చెందిన అధ్యయన బృందం సాధించిన ఈ ఘనత తాలూకు వివరాలు ఏసీఎస్ అప్లయిడ్ నానో మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. గోల్డ్, కాపర్ సలై్ఫడ్ రేణువులు క్యాన్సర్ కణాలను అత్యంత సులభంగా గుర్తించగలవు కూడా. రేణువులను రోగమున్న చోట ప్రవేశపెట్టాక అక్కడ కాంతిని ప్రసరింపజేయాలి. కాంతిని శోషించుకున్న రేణువులు ఉష్ణాన్ని జనింపజేస్తాయి. వేడితోపాటే విషపూరిత స్వేచ్ఛాయుత ఆక్సిజన్ అణువులను ఇవి విడుదలచేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను ఖతంచేస్తాయి. గోల్డ్, కాపర్ సల్ఫైడ్ రేణువులు వ్యాధి నిర్ధారణ కారకాలుగా పనిచేస్తాయి. కాంతిని సంగ్రహించి అల్ట్రాసౌండ్ తరంగాలను విడుదలచేస్తాయి. దీంతో ఏ దిశలో ఎన్ని క్యాన్సర్ కణాలు ఉన్నాయో స్పష్టంగా తెల్సుకోవచ్చు. ఈ విధానం క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ప్రక్రియను మరింత మెరుగుపరచనుంది. క్యాన్సర్ కణజాలం గుండా ఈ అ్రల్టాసౌండ్ తరంగాలు ప్రసరించినపుడు క్యాన్సర్ కణతులపై ఆక్సిజన్ ఆనవాళ్లు, వాటి ఆకృతులు అత్యంత స్పష్టంగా కనిపించనున్నాయి. గతంలో ఈ రేణవులను పెద్ద పరిమాణంలో తయారుచేయగా ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు ఈసారి అత్యంత సూక్ష్మ స్థాయిలో అంటే 8 నానోమీటర్ల పరిమాణంలో తయారుచేయగలిగారు. కాపర్ సలై్ఫడ్ ఉపరితలంపై అత్యంత సూక్ష్మమైన పుత్తడి రేణువులను చల్లి ఈ గోల్డ్, కాపర్ మిశ్రమధాతు రేణువులను సృష్టించారు. ఇవి ఇంత చిన్న పరిమాణంలో ఉండటంతో సులువుగా క్యాన్సర్ కణజాలంలోకి చొచ్చుకుపోగలవు. ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కణాలపై ఈ రేణువులను ప్రయోగించి చక్కని ఫలితాలను సాధించారు. -
ఏసీ అక్కర్లేదు, ఒక చెట్టున్నా చాలు
న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఏసీ గదుల్లోంచి బయటకు రావడానికే జనం ఇష్టం పడడం లేదు. సుభాషిణి చంద్రమణి అనే మహిళ మాత్రం ఎండ నుంచి రక్షణకి ఏసీ గదులు అక్కర్లేదని ఒక చెట్టు చాలని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆమె మండుటెండలో నిల్చొని ఉష్ణోగ్రతని రికార్డు చేస్తే 40 డిగ్రీల సెల్సియస్ చూపించింది. అలా నడుచుకుంటూ పక్కనే ఉన్న చెట్టు నీడలోకి వెళితే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయి 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంటే ఏకంగా 13 డిగ్రీలు తేడా ఉందన్న మాట. ఆమె ఈ ప్రయోగం చేసి దానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తే అది వైరల్‌గా మారింది. -
అమ్మకాల్లో 20 శాతం వృద్ధి 2023-24పై గోద్రెజ్ అప్లయన్సెస్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలు 20 శాతం పెరిగి రూ. 6,200 కోట్లకు చేరగలవని గోద్రెజ్ అప్లయన్సెస్ అంచనా వేస్తోంది. ప్రీమియం ఉత్పత్తుల వాటా ప్రస్తుతమున్న 35 శాతం నుంచి 40 శాతానికి పెరగగలదని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలు రూ. 5,200 కోట్లుగా ఉండగలవని అంచనా వేస్తున్నట్లు సంస్థ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది చెప్పారు. ఏసీల విభాగం అమ్మకాలు రెండింతలు పెరిగి రూ. 1,200 కోట్లకు చేరగలవని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కంపెనీ అమ్మకాల్లో ఏసీల వాటా 15 శాతంగా ఉండగా ఇది 22 శాతానికి చేరవచ్చని నంది చెప్పారు. కొత్తగా లీక్ ప్రూఫ్ ఎయిర్ కండీషనర్లను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దీని ధర రూ. 48,900గా ఉంటుంది. ఈ వేసవిలో కూలింగ్ ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చైనా నుంచి సరఫరాల్లో అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం చాలా మటుకు విడిభాగాలు, పరికరాలను దేశీయంగానే తయారు చేసుకోవడం పెరుగుతోందని నంది వివరించారు. -
కరెంటు అక్కర్లేని ఏసీ.. నిమిషాల్లో కూల్ అయ్యే బెడ్ షీట్లు
సాక్షి, అమరావతి: మానవ విజ్ఞానం క్షణానికో సరికొత్త ఆవిష్కరణతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటోంది. ప్రస్తుతం విద్యుత్ యుగం నడుస్తోంది. మోటార్లు, స్కూటర్లు, ఏసీలు, మొబైళ్లు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల విద్యుత్‌తో పనిచేసే పరికరాలు మనుషులకు అందుబాటులో ఉన్నాయి. బొగ్గుతోనే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యంపై ఆందోళన మొదలై కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయితే సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి కూడా ఖర్చుతో కూడుకున్నదే కావడంతో అసలు విద్యుత్ అవసరమే లేకుండా పనులు జరిగిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన కొన్ని దేశాల్లో శాస్త్రవేత్తలను కొత్త ప్రయోగాలకు పురిగొల్పింది. దేశ, విదేశాల్లో వెలుగుచూస్తున్న అలాంటి సరికొత్త ఆవిష్కరణల్లో కొన్ని ఇవి. కూలింగ్ దుప్పట్లు మంచంపై వేసే దుప్పటి సరైనది కాకపోతే ఉక్కపోతకు గురికావాల్సి వస్తుంది. వెంటనే ఏసీ వేసుకోవాలనిపిస్తుంది. కానీ కరెంట్ లేకుండానే, ఏసీ వేయకుండానే మనల్ని అచ్చం ఏసీలా కూల్ చేసే బెడ్ షీట్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బెడ్‌షీట్‌ను చాలా తక్కువ ధరకు ఆన్లైన్, ఆఫ్లైన్లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర దాదాపు రూ.1,500. కొన్ని ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో రూ. 699కే లభిస్తోంది. ఇది జెల్ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. దీనిని ఉపయోగించిన నిమిషాల్లోనే మనకు చల్లదనాన్ని అందిస్తుంది. మురికిగా అయితే, దానిని పొడి గుడ్డతో సులువుగా శుభ్రం చేయవచ్చు. ఏసీ లేకుండానే ఇల్లు కూల్ విద్యుత్ బిల్లులకు భయపడి ఏసీలకు దూరంగా ఉండే సామాన్యుల కోసం గువహటి ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక మార్గాన్ని కనిపెట్టారు. రేడియేటివ్ కూలర్ పూతను అభివృద్ధి చేశారు. దీనిని ఇంటి పైకప్పులకు వేస్తే కరెంటు అవసరం లేకుండా ఇంటి మొత్తానికీ చల్లదనం అందిస్తుందని వారు చెబుతున్నారు. ఇలాంటి విధానాలను ‘పాసివ్ రేడియేటివ్ కూలింగ్’ అని పిలుస్తున్నారు. పరిసరాల్లోని వేడిని గ్రహించి దానిని పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేసే సాంకేతికత ఇందులో ఉంటుంది. ఈ రేడియేటివ్ కూలర్ పూత కారణంగా ఇంట్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయట. కరెంటు అక్కర్లేని ఏసీ ఎయిర్ కండిషనర్ (ఏసీ)ని ప్రస్తుతం నాలుగు గోడల మధ్య వినియోగిస్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో వినియోగించేందుకు టవర్ కూలర్లు ఉన్నప్పటికీ వాటికి చాలా విద్యుత్ అవసరం. ఆరుబయట విద్యుత్ అవసరం లేకుండా ఏసీ పెట్టుకుని పరిసరాలను చల్లగా మార్చవచ్చంటోంది ఇజ్రాయెల్‌కు చెందిన కెన్షో కంపెనీ. ఈ కంపెనీ లిక్విడ్ నైట్రోజన్ ఆధారంగా పనిచేసే ఏసీని అభివృద్ధి చేసింది. ఏసీలోని ప్రామాణిక ట్యాంకుల్లో ద్రవ నత్రజని –196 డిగ్రీల వద్ద ఫ్రీజ్ అయ్యి ఉంటుంది. ఇది గ్యాస్‌గా మారే క్రమంలో బలమైన ఒత్తిడిని కలగచేస్తుంది. ఆ ఒత్తిడితో ఈ ఏసీ పనిచేస్తుంది. దీంతో ఆ పరిసర ప్రాంతం పూర్తిగా చల్లబడుతుంది. ఈ ఏసీలకు ఇప్పటికే 40 దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయట. -
ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ల సేల్కు తెర తీసింది. ‘ మాన్సూన్ ధమకా సేల్’ పేరుతో 4 రోజుల అమ్మకాలను ప్రారంభించింది. జూన్ 30 వరకు జరగనున్న ఈ అమ్మకాల్లో స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తుంది. అలాగే హెచ్డీఎఫ్సీ, ఎస్బిఐ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్, ఎల్జీ, ప్యానసోనిక్, బ్లూస్టార్, వర్ల్‌పూల్, కేరియర్, వోల్టాస్, ఒనిడా కంపెనీల ఏసీలపై 41 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. శాంసంగ్: 1.5 టన్నుల 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .34,990 (అసలు రూ. 56,990) 38 శాతం తగ్గింపు 5 స్టార్ బీఇ రేటింగ్, టర్బో కూలింగ్ ఫీచర్‌తో పాటు డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ దీని సొంతం. క్యారియర్ 4-ఇన్ -1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.5 టన్నుల స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .39,990 (అసలు రూ .61,990) 35శాతం తగ్గింపు వోల్టాస్ 2 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .28,990 (అసలు రూ. 54,990) వద్ద లభిస్తుంది 47శాతం తగ్గింపు వర్ల్‌పూల్ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ రూ .31,490 (అసలు ధర రూ .53,420) 41 శాతం తగ్గింపు బ్లూ స్టార్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .30,490 (అసలు ధర రూ .50,000). 39 శాతం తగ్గింపు చదవండి : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఊరట -
ఏసీ, ఎల్ఈడీల తయారీకి పీఎల్ఐ స్కీమ్
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ కండీషనర్, ఎల్ఈడీ విద్యుత్తు దీపాలు వంటి వైట్ గూడ్స్ తయారీ సంస్థలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం వర్తింపచేయాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకోసం రూ. 6,238 కోట్లు వెచ్చించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా తయారీ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు పీఎల్ఐ పథకంపరమైన ప్రోత్సాహకాలు దోహదపడనున్నాయి. దీని ద్వారా విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఎగుమతులు పెరుగుతాయని కేంద్రం ఆశిస్తోంది. వైట్ గూడ్స్ పీఎల్ఐ స్కీమ్ ప్రకారం దేశీయంగా ఏసీలు, ఎల్ఈడీ లైట్లు తయారు చేసే కంపెనీలకు అయిదేళ్లపాటు విక్రయాలపై 4 నుంచి 6 శాతం దాకా ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రస్తుతం భారత్‌లో తగినంత స్థాయిలో ఉత్పత్తి లేనటువంటి ఉత్పాదనల తయారీని ప్రోత్సహించేందుకు దీన్ని ఉద్దేశించారు. ఫినిష్డ్ గూడ్స్‌ను అసెంబ్లింగ్ మాత్రమే చేసే సంస్థలకు ఇది వర్తించదు. కొత్తగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి. రానున్న ఐదేళ్ల కాలంలో పీఎల్ఐ పథకం వల్ల రూ. 7,920 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ .64,400 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని, ప్రత్యక్ష–పరోక్ష మార్గాల్లో రూ. 49,300 కోట్ల ఆదాయం సమకూరడమే కాకుండా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది కేంద్రం అంచనా. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి .. అధిక సామర్థ్యం కలిగిన గిగా వాట్ స్థాయి సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి కూడా ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యుల్స్’ పేరుతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం వర్తింపజేస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ. 4,500 కోట్లు ప్రోత్సాహకాలుగా వెచ్చించనుంది. దేశీయ పరిశ్రమలో సోలార్ పీవీ మాడ్యుల్స్ నిర్వహణ సామర్థ్యాలు తక్కువగా ఉన్నందున వీటి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అందువల్ల దేశీయంగా సామర్థ్యం పెంపు కోసం పీఎల్ఐ స్కీమ్ అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. -
యాంబర్ - స్పెన్సర్స్.. జూమ్
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్‌చేసి 40,330ను తాకింది. నిఫ్టీ 86 పాయింట్లు ఎగసి 11,848 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో డీమార్ట్ స్టోర్ల ప్రమోటర్ రాధాకిషన్ దమానీ కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో రిటైల్ రంగ కంపెనీ స్పెన్సర్స్ రిటైల్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏసీ దిగుమతులపై నిషేధాన్ని ప్రకటించడంతో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం యాంబర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. యాంబర్ ఎంటర్ప్రైజెస్ రిఫ్రిజిరేంట్స్సహా ఎయిర్ కండిషనర్ల(ఏసీ) దిగుమతులపై విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) నిషేధం విధించిన వార్తలతో రెండు రోజులుగా యాంబర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. తాజాగా ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 2,410 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 2,340 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 18 శాతం జంప్‌చేసింది. స్పెన్సర్స్ రిటైల్ డీమార్ట్ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ క్యూ2లో (జులై-సెప్టెంబర్) స్పెన్సర్స్ రిటైల్‌లో అదనపు వాటాను కొనుగోలు చేశారు. ఈ ఏడాది జూన్ చివరికల్లా స్పెన్సర్స్ రిటైల్‌లో రాధాకిషన్ దమానీ 2.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. స్పెన్సర్స్ రిటైల్ బీఎస్ఈకి అందించిన వివరాల ప్రకారం సెప్టెంబర్‌కల్లా దమానీ వాటా 2.20 శాతానికి పెరిగింది. వెరసి 3.25 లక్షల స్పెన్సర్స్ షేర్లను దమానీ క్యూ2లో కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో స్పెన్సర్స్ రిటైల్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 7 శాతం వరకూ ఎగసింది. రూ. 78 సమీపంలో ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 3 శాతం బలపడి రూ. 75 వద్ద ట్రేడవుతోంది. -
ఏసీలు పేలి 17 మంది మృతి
ఢాకా: బంగ్లా రాజధాని శివార్లలోని మసీదులో ఆరు ఎయిర్‌కండీషనర్లు పేలడంతో 17మంది మరణించారు. అండర్‌గ్రౌండ్ గ్యాస్‌పైప్‌లో లీకేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుళ్లలో దాదాపు 20 మంది గాయపడ్డారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నారాయణ్‌గంజ్ పోర్టుటవున్‌లోని బైతుల్‌సలాత్ మసీద్‌లో శుక్రవారం ప్రార్ధనలకు భక్తులు సమవేశమయ్యారు. ఈ సమయంలో జరిగిన పేలుడులో చిన్నారితో సహా 11 మంది మృతి చెందారు. గాయపడినవారి పరిస్థితి విషమంగానే ఉందని, ఎక్కువమంది శరీరాలు దాదాపు 90 శాతం వరకు కాలిపోయాయని, సగంమందికి ఊపిరితిత్తుల మార్గంలో గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం పట్ల ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. మసీదు దిగువన టైటస్ కంపెనీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్ ఉందని, దీనిలోంచి గ్యాస్ లీకై మసీదులో నిండి ఉండొచ్చని, ఇదే సమయంలో ఏసీ లేదా ఫ్యాన్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా అంటుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలోనే ఈ పైప్‌లైన్ లీకేజ్‌లపై మసీదు కమిటీ ఫిర్యాదు చేసింది. -
ఫ్రిజ్‌లు, ఏసీలు రయ్రయ్!
న్యూఢిల్లీ: వినియోగ ఉత్పత్తుల విక్రయాలపై మందగమన ప్రభావాలు గణనీయంగా కనిపిస్తున్నప్పటికీ .. ఎలక్ట్రికల్ ఉపకరణాల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదుకావడంతో ఏసీలు, ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు వంటి పలు రకాల కూలింగ్ ఉత్పత్తుల విక్రయాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలోని మిగతా విభాగాలతో పోలిస్తే ఎలక్ట్రికల్ ఉపకరణాల విభాగం మెరుగైన పనితీరు కనపర్చినట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈడీ అనుజ్ పొద్దార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిశ్రమపరంగా ఏసీల అమ్మకాలు 20 శాతం, ఫ్రిజ్‌ల విక్రయాలు 12 శాతం మేర వృద్ధి సాధించినట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. టీవీల కన్నా .. ఏసీలకే ఓటు.. వేసవి ఉష్ణోగ్రతలు ఈసారి ఎగబాకడంతో కొనుగోలుదారులు టీవీల కన్నా ఏసీల వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు నంది పేర్కొన్నారు. అంతే కాకుండా వీడియో కంటెంట్ చూసే విషయానికొస్తే.. టీవీల్లో కన్నా మొబైల్ ఫోన్స్‌కి ప్రాధాన్యం పెరుగుతుండటం కూడా టీవీల అమ్మకాలపై ప్రభావం చూపిందన్నారు. దీంతో టీవీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని వివరించారు. ఆఖరికి క్రికెట్ వరల్డ్ కప్ కూడా టెలివిజన్ల అమ్మకాల వృద్ధికి ఉపయోగపడలేదు. మరోవైపు లో–బేస్ ఎఫెక్ట్ సైతం ఏసీల విక్రయాల్లో వృద్ధికి కొంత కారణమై ఉండొచ్చని బ్లూస్టార్ జాయింట్ ఎండీ బి. త్యాగరాజన్ తెలిపారు. గతేడాది అధిక కమోడిటీల ధరలు, కరెన్సీ మారకం రేటులో హెచ్చుతగ్గులు, కొంత సాధారణ ఉష్ణోగ్రతలు తదితర అంశాల కారణంగా ఏసీల విక్రయాల వృద్ధి పెద్దగా నమోదు కాలేదని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు, వరదల మూలంగా ఆగస్టులో ఏసీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉన్నా పండుగల సీజన్ మొదలవుతుండటంతో సెప్టెంబర్‌లో మళ్లీ వృద్ధి కనిపించవచ్చని పేర్కొన్నారు. మందగమన ప్రభావాలూ ఉన్నాయి.. జూలై, ఆగస్టుల్లో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం అమ్మకాలు అంత ఆశావహంగా ఏమీ లేవని నంది పేర్కొన్నారు. కొన్ని విభాగాల్లో క్షీణత కూడా నమోదైందని వివరించారు. చాలా రంగాల్లో ఆర్థిక మందగమనం మూలంగా.. వినియోగదారుల కొనుగోలు ధోరణులపై కూడా ప్రభావం పడిందని తెలిపారు. కొనుగోలు నిర్ణయాలను కస్టమర్లు వాయిదా వేసుకోవడం కూడా జరిగిందని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. మరోవైపు, వర్షపాతం సరైన రీతిలో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పంటలు వేయడంలో జాప్యాలు జరగ్గా.. ఇంకొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతంతో పంటలు కొట్టుకుపోవడం జరిగిందని నంది చెప్పారు. ఇలా వ్యవసాయోత్పత్తి మందగించి, ఆదాయాలు తగ్గడం వల్ల కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ కూడా మిగతా రంగాల్లాగానే క్షీణత నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. రేట్ల కోత ఊతం.. వినియోగదారులు, పరిశ్రమ సెంటిమెంటును మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొన్ని చర్యలు పరిస్థితి మెరుగుపడటానికి ఊతమివ్వగలవని భావిస్తున్నట్లు నంది చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మేర కేంద్రం నిధులు ప్రకటించడం, ఆర్బీఐ పాలసీపరంగా కీలకవడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలతో మార్కెట్లో నిధుల లభ్యత మెరుగుపడుతుందని, రుణ వితరణ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. వినియోగదారుల సానుకూల సెంటిమెంటు, వర్షపాతం, ఉపాధి కల్పన.. ఈ మూడు అంశాలు పరిశ్రమకు కీలకంగా ఉంటాయని చెప్పారు. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఉదార విధానాలు, వ్యవస్థలో నిధుల లభ్యత మెరుగుపడటం మొదలైనవి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వినియోగ వృద్ధికి ఊతమివ్వగలవని వివరించారు. ప్రథమార్ధం మందగించడంతో.. వినియోగ వస్తువుల తయారీ సంస్థలు.. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రమోషనల్ ఆఫర్లను మరింతగా పెంచవచ్చని, పలు ఆకర్షణీయ ఫైనాన్సింగ్ స్కీములు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని హేతల్ గాంధీ చెప్పారు. కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో ఏకంగా 21 శాతం వాటా పండుగ సీజన్‌దే ఉంటోంది. అయినప్పటికీ 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం గతంలో అంచనా వేసిన 6–7 శాతం కన్నా 200–300 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చని పేర్కొన్నారు. -
నయా ఏసీలతో భలే మేలు..!
ఈ రోజుల్లో ఇళ్లల్లో.. షాపింగ్‌మాల్స్‌లో.. రెస్టారెంట్లలో.. ఎక్కడకు వెళ్లినా ఏసీలు తప్పనిసరి! చల్లదనం మాటెలా ఉన్నా.. వీటిల్లో వాడే రసాయనాల పుణ్యమా అని.. పర్యావరణానికి కలుగుతున్న నష్టం ఇంతింత కాదు! మరి తరుణోపాయం..? కార్బన్ డయాక్సైడ్ అంటోంది ఐఐటీ మద్రాస్! పర్యావరణ కాలుష్యానికి విరుగుడుగా కార్బన్ డయాక్సైడ్ వాడకం ఎలాగో తెలుసుకునే ముందు కొన్ని విషయాలను అర్థం చేసుకోవా ల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం రిఫ్రిజరేటర్లు, భారీస్థాయి ఏసీల్లోనూ హైడ్రోఫ్లోరో కార్బన్స్ (హెచ్ఎఫ్సీ) అనే శీతలీకరణ రసాయనాలను వాడుతున్నాం. ఓజోన్ పొరకు నష్టం కలుగుతోందన్న కారణంతో ఒకప్పుడు వాడిన క్లోరోఫ్లోరో కార్బన్స్ స్థానంలో ఈ కొత్త రసాయనాలు వచ్చాయి. మొదట్లో అంతా బాగుందని అనుకున్నా.. ఈ హెచ్ఎఫ్సీలు కార్బన్ డయాక్సైడ్ కంటే కొన్ని వందల, వేల రెట్లు ఎక్కువ ప్రమాదకరమని పరిశోధనల ద్వారా స్పష్టమైంది. వాతావరణంలోకి చేరే కార్బన్ డయాక్సైడ్ సహజసిద్ధంగా నాశనమయ్యేందుకు వంద సంవత్సరాలు పడుతుందని అనుకుంటే.. హెచ్ఎఫ్సీలు కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉండిపోతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2100 నాటికి ఒక్క హెచ్ఎఫ్సీల కారణంగానే భూమి ఉష్ణోగ్రత 0.5 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరుగుతుందని అంచనా. సమస్య ఇంత తీవ్రంగా ఉన్న కారణంగానే ఈ హెచ్ఎఫ్సీల వాడకాన్ని 2050 నాటికల్లా కనీసం 90 శాతం తగ్గించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఇందుకు తగ్గట్టుగానే హెచ్ఎఫ్సీలకు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఇప్పటికే కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేసినప్పటికీ లోటుపాట్లు ఎక్కువగా ఉన్న కారణంగా అవేవీ విస్తృతంగా వాడకంలోకి రాలేదు. గతంలో వాడిందే మళ్లీ.... రిఫ్రిజిరేటర్లలో శీతలీకరణ కోసం ఒకప్పుడు కార్బన్ డయాక్సైడ్నే వాడేవారు. అయితే అధిక ఒత్తిడికి గురిచేసి వాడాల్సి ఉండటం.. మరమ్మతుల సమయంలో ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. 19వ శతాబ్దపు చివరినాటికి కృత్రిమంగా తయారు చేసిన క్లోరో ఫ్లోరో కార్బన్స్ వాడకం మొదలైంది. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం శాస్త్రవేత్త ప్రకాశ్ మయ్యా కార్బన్ డయాక్సైడ్ రిఫ్రిజరేషన్పై ప్రయోగాలు మొదలుపెట్టారు. నార్వే సంస్థతో కలసి చేపట్టిన ఈ ప్రయోగాల ఫలితంగా ఓ నమూనా రిఫ్రిజరేటర్ సిద్ధమైంది. రెండు ప్రయోజనాలు... కార్బన్ డయాక్సైడ్ శీతలీకరణ రసాయనంగా వాడే ఏసీల వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. భవనాల్లోపలి భాగాలకు చల్లదనం అందించడం ఒక ప్రయోజనమైతే.. ఈ క్రమంలో వెలువడే వేడిని కూడా ఒడిసిపట్టుకోగలగడం రెండోది. ఆసుపత్రులతోపాటు కొన్ని ఇతర చోట్ల ఒకపక్క చల్లదనం పొందుతూనే ఇంకోపక్క వేడినీటిని సిద్ధం చేసుకోవచ్చునన్నమాట. థర్మల్ పవర్ స్టేషన్లు మొదలుకొని చాలా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే కార్బన్ డయాౖక్సైడ్ను అక్కడికక్కడే సేకరించి శీతలీకరణ కోసం వాడుకోవచ్చు కాబట్టి ఈ కొత్త ఏసీలకయ్యే ఖర్చు చాలా తక్కువగానే ఉంటుందని అన్నారు. స్పెయిన్‌లోని వెలంసియాలో ఇటీవల జరిగిన ఒక సదస్సులో ఈ కొత్త టెక్నాలజీకి మంచి ఆదరణ లభించింది. ఆ సదస్సులో పాల్గొన్న ప్రకాశ్ మయ్యా మాట్లాడుతూ ‘‘పర్యావరణ అనుకూల శీతలీకరణ రసాయనాల తయారీకి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తోంది. సూపర్ మార్కెట్లు, ఆసుపత్రుల్లోనూ తక్కువ ఖర్చుతో చల్లదనాన్ని కల్పించేందుకు అనువైన టెక్నాలజీ ఇది’’అని అన్నారు. విద్యుత్ వినియోగంలో 20 శాతం తగ్గుదల సాధారణ ఏసీలతో పోలిస్తే 20 శాతం తక్కువ విద్యుత్తును వాడుకుంటూనే ఈ నమూనా ఏసీ ఎక్కువ చల్లదనాన్ని కూడా అందిస్తుందని, ఏడాదిగా తాము దీన్ని విజయవంతంగా నడుపుతున్నామని ప్రకాశ్ మయ్యా బృందంలోని శాస్త్రవేత్త సిమర్‌ప్రీత్ సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. యూరప్‌లోనూ కార్బన్ డయాక్సైడ్ సాయంతో పనిచేసే ఏసీలు ఉన్నప్పటికీ అధిక ఉష్ణోగ్రత ఉన్న వాతావరణాల్లో అవి పనిచేయవని చెప్పారు. తాము తయారు చేసిన నమూనా మాత్రం 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితుల్లోనూ చక్కగా పనిచేసిందని.. పరిసరాలను చల్లబరిచిందని వివరించారు. అయితే ప్రస్తుతానికి పది టన్నులు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యమున్న ఏసీలతోనే వాడాల్సి ఉంటుందని.. వ్యక్తిగత స్థాయిలో తయారీకి మరికొంత కాలం పడుతుందని వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మరో రెండు రోజుల్లో ఆ వస్తువులపై బాదుడే
కోల్‌కతా : మరో రెండు రోజుల్లో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్ ఓవెన్లపై ఈ కంపెనీల బాదుడు షురూ అవుతుంది. ఇప్పటికే ధర ఎక్కువగా ఉండే ఈ వస్తువులు, మరింత కాస్ట్లీగా మారనున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, వీటికి కీలక వనరులుగా ఉంటున్న స్టీల్, కాపర్ ధరలు ఎగియడం వల్ల వీటి ధరలు పెరుగుతున్నట్టు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చిన దగ్గరనుంచి ప్రీమియం మోడల్స్ ధరలన్నీ 400 వందల రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ధరలు పెరుగతాయని తెలిపారు. ఇన్పుట్ కాస్ట్ ఒత్తిడి, రూపాయి విలువ పడిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీటి ధరలు పెంచాల్సి వస్తుందని కంపెనీలు తెలిపాయి. ఈ ధరలు పెంపు జూన్ నుంచి దశల వారీగా ఉంటుందని గోద్రేజ్ అప్లియన్స్ బిజినెస్ హెడ్ కమల్ నండీ చెప్పారు. గోద్రేజ్ వీటి ధరలను 2 నుంచి 3 శాతం పెంచుతుండగా... దేశంలో అతిపెద్ద ఎయిర్-కండీషనర్ తయారీదారిగా ఉన్న ఓల్టస్ 3 శాతం ధరలను పెంచింది. త్వరలోనే తాము కూడా ధరలను పెంచుతామని వర్పూల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సైతం చెప్పారు. అయితే ఈ ధరల పెంపుపై ఎల్జీ, శాంసంగ్ మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రమోషన్ ఆఫర్లతో ఈ ధరల పెంపు ప్రభావాన్ని వినియోగదారులపై తగ్గిస్తామని ఓల్టస్ ఎండీ ప్రదీప్ భక్షి అన్నారు. అయితే ఈ ధరల పెంపు తమ డిమాండ్‌పై ప్రభావం పడదని, 70 శాతం విక్రయాలు కన్జ్యూమర్ ఫైనాన్సింగ్‌పై ఆధారపడి ఉంటాయని ముంబైకి చెందిన రిటైలర్ విజయ్ సేల్స్ మేనేజింగ్ పార్టనర్ నైలేష్ గుప్తా చెప్పారు. -
హైదరాబాద్‌లో హైటెక్ బస్‌స్టాపులు
సాక్షి, హైదరాబాద్ : ఎయిర్కండీషనింగ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఏటీఎం, కాఫీ మిషన్లు, వైఫై, సీసీ టీవీ, టాయిలెట్లు ఇవన్నీ ఇప్పటిదాక మనం ఎయిర్‌పోర్టులో లేదా మెట్రో స్టేషన్లలోనే చూసేవాళ్లం. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ బస్‌స్టాపుల్లో కూడా ఈ సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యాధునిక హంగులతో బస్‌స్టాపులను(బస్షెల్టర్లను) ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రయాణికులకు అత్యంత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఏసీ, వైఫై, ఏటీఎం, సీసీ టీవీ, మొబైల్ చార్జింగ్, టాయిలెట్లు ఉండేలా ఆధునిక బస్షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది. పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్‌షెల్టర్‌ను శిల్పారామం వద్ద రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసు దగ్గర, కూకట్‌పల్లికి దగ్గరిలో కేపీహెచ్‌బీ వద్ద మరో రెండు ఆధునిక లేదా గ్రేడ్ 1 బస్షెల్టర్లు తుది దశలో ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 826 ఆధునిక బస్షెల్టర్లను నాలుగు ప్యాకేజీలలో జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. వీటిలో మొదటి గ్రేడ్‌లో అడ్వాన్స్డ్ ఏసీ బస్షెల్టర్లను నిర్మిస్తున్నారు. కేవలం పాశ్చాత్య దేశాల్లోని ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ విధమైన బస్షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. గ్రేడ్-2 బస్షెల్టర్లలో డస్ట్బిన్లు, టాయిలెట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, తాగునీటి సౌకర్యం, వైఫై, ఫ్యాన్లు, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రేడ్-3 బస్‌షెల్టర్‌లో డస్ట్‌బిన్, మొబైల్ చార్జింగ్ పాయింట్, టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం ఉండనుంది. గ్రేడ్-4లో కేవలం బస్షెల్టర్తో పాటు డస్ట్బిన్లే ఉంటాయి. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా 826 బస్షెల్టర్లను విభజించి టెండర్ ద్వారా వివిధ ఏజెన్సీలకు అప్పగించారు. అత్యాధునిక బస్షెల్టర్లతో ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ నగరం ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో మాదిరిగా నగరవాసులకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. -
తగ్గనున్న ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ల ధరలు
-
తగ్గనున్న ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల వస్తువులు, నిత్యావసర వస్తువుల జీఎస్టీ రేట్లను తగ్గించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌పై కూడా పన్ను రేట్లు తగ్గించేందుకు యోచిస్తోంది. ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లపై ప్రస్తుతమున్న 28 శాతం పన్ను రేట్లను తగ్గించాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. పన్ను రేట్లు అధికంగా ఉన్నందున్న తమ విక్రయాలు తగ్గిపోయాయంటూ తయారీదారులు చేస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ కీలక నిర్ణయం వీటికి డిమాండ్‌ను పెంచనుంది. మహిళలను లక్ష్యంగా చేసుకుని పన్ను రేట్లను తగ్గించబోతున్నట్టు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. ఈ నిర్ణయం మహిళలకు ఎంతో ఉపయోగపడనుందన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రెస్టారెంట్లపై కూడా జీఎస్టీ రేట్లను తగ్గించినట్టు పేర్కొన్నారు. కేంద్రం తీసుకోబోయే మరో కీలక నిర్ణయంతో ఎలక్ట్రిక్ వస్తువులు, కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ పన్ను రేట్లు 18 శాతానికి దిగిరానున్నట్టు తెలుస్తోంది. ఇక ఇవి లగ్జరీ గూడ్స్‌గా పరిగణలోకి రావని వెల్లడవుతోంది. ''అన్ని కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌ను ఒకే పన్ను 18 శాతం పరిధిలోకి తీసుకొస్తే, దేశీయ తయారీదారులకు ఎంతో మేలు చేకూర్చినట్టు అవుతుంది. ధరలు తగ్గుతాయి. దీంతో డిమాండ్ పైకి ఎగుస్తుంది'' అని డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్ మని తెలిపారు. గత వారంలోనే 28శాతం శ్లాబులో ఉన్న 178 వస్తువులపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. షాంపూలు, వాషింగ్ పౌడర్ డిటర్జెంట్, ఫేషియల్ మేకప్, చాక్లెట్లు, వెట్ గ్రైండర్లు, బ్యాటరీలు, చేతివాచీలు తదితర వాటిపై జీఎస్టీని 18శాతానికి తగ్గించారు. ప్రస్తుతం 28శాతం శ్లాబులో కేవలం 50 వస్తువులే ఉన్నాయి. -
ఏసీలు, ఫ్రిడ్జ్‌లు మరింత కాస్ట్లీ
ముంబై : ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్ల ధరలు మరింత కాస్ట్లీగా మారబోతున్నాయి. వచ్చే నెల నుంచి వీటి ధరలు 3-5 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పెరిగిన ఇన్పుట్ వ్యయాల మేరకు ధరలు పెంచాలని ఈ వైట్ గూడ్స్ తయారీదారులు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో వీటి ధరలు పెరుగబోతున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. గత ధరల పెంపు నుంచి ఇప్పటి వరకు ఇన్పుట్ వ్యయాలు 30-35 శాతం మేర పెరిగినట్టు తెలిసింది. స్టీల్ ధర 40 శాతం, కాపర్ ధర 50 శాతం పెరగడంతో పాటు రిఫ్రిజిరేటర్లలో ఎక్కువగా వినియోగించే కీలక కెమికల్ ఎండీఐ అంతర్జాతీయంగా లోపించింది. దీంతో ఇన్పుట్ వ్యయాలు రెండింతలు పైకి ఎగిశాయి. ఈ మూడు కలిపి ఇన్పుట్ వ్యయాల్లో 70 శాతం మేర నమోదవుతున్నాయి.. దీంతో వైట్ గూడ్స్ ధరలపై నికరంగా 5-6 శాతం ప్రభావం పడనుందని గోద్రెజ్ అప్లియెన్స్ బిజినెస్ హెడ్ కమల్ నంది చెప్పారు. దీనిలో కొంత కంపెనీలు భరించి, మిగిలిన మొత్తం వినియోగదారులపై విధించనున్నట్టు పేర్కొన్నారు. తొలుత రిఫ్రిజిరేటర్ల ధరలు పెంచుతామని వచ్చే నెల నుంచి ఈ పెంపు ఉంటుందని నంది తెలిపారు. తర్వాత వాషింగ్ మిషన్లు, అనంతరం జనవరి నుంచి ఏసీ ధరల సమీక్ష ఉంటుందన్నారు. వైట్ గూడ్స్‌లో మార్కెట్ లీడర్లుగా ఉన్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, దాని ప్రత్యర్థి శాంసంగ్‌లు కూడా ఈ కేటగిరీ ఉత్పత్తులపై ధరల పెంపుకు సన్నాహాలు చేస్తున్నాయని దిగ్గజ రిటైల్ చైన్ చీఫ్ చెప్పారు. అయితే శాంసంగ్ ధరల పెంపును ఖండించగా.. ఎల్జీ ఇంకా స్పందించలేదు. -
జీఎస్టీ కాక .. డిస్కౌంట్ల మోత
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చట్టం జూలై 1 నుంచి అమలుకాబోతున్న నేపథ్యంలో దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. తుదిగడువు దగ్గర పడే కొద్ది నిల్వలు వదిలించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈనేపథ్యంలో పేటియం నుంచి షాప్‌క్లూస్ దాకా, లెవీస్ మొదలుకొని బజాజ్ ఆటో వరకు, బ్రాండ్స్ నుంచి రిటైలర్స్ దాకా అన్ని కంపెనీలు భారీ డిస్కౌంట్‌ను ప్రకటిస్తున్నాయి.అన్ని ఈ- కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫాం ద్వారా విక్రయాలు జరిపే ఉత్పత్తులపై అధిక మొత్తంలో తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. ఇవిగో కొన్ని ఆఫర్లు... ► మెడిసిన్స్ పై 20 శాతం తగ్గింపును 1ఎంజీడాట్ కామ్ ప్రకటించింది. ► స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ పుమా కంపెనీ ఫ్లాట్ 40 శాతం డిస్కౌంట్‌పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ► వస్త్ర ఉత్పత్తి కంపెనీ అల్లెన్ సోలీ కస్టమర్లకు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇస్తోంది. ► లెవీస్ కంపెనీ బై టు గెట్ టు ఆఫర్‌ను ఇస్తుండగా... ఫ్లైయింగ్ మేషిన్ కంపెనీ 50 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. ► బజాజ్ ఆటో వివిధ మోడల్స్ పై కోనుగోలు దారులకు రూ.4500 దాకా డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. ► సెల్ఫోన్లపై పలు డిస్కౌంట్లను పలు కంపెనీలు ప్రకటించనున్నాయి. -
రండి బాబూ.. రండి!
⇔ ప్రీ జీఎస్టీ క్లియరెన్స్ సేల్.. ⇔ జీఎస్టీ అమలుపై గ్రేటర్ వ్యాపారుల్లో గందరగోళం ⇔ మిగిలి ఉన్న స్టాకుపై పన్ను వేస్తారని ఆందోళన ⇔ ప్రీ జీఎస్టీ క్లియరెన్స్ సేల్ పేరిట తగ్గింపుతో అమ్మకాలు ⇔ ఆందోళన వద్దంటున్న వాణిజ్య పన్నుల శాఖ ⇔ జీఎస్టీతో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల ధరలు పెరిగే చాన్స్ సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను(జీఎస్టీ).. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలులోకి తీసుకురానున్న దేశమంతా ఒకే పన్ను విధానం.. జీఎస్టీతో కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయని, మరికొన్ని పెరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్రేటర్‌లోని వ్యాపారుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే తమ వద్ద మిగిలి ఉన్న ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు తదితరాల స్టాకుపై జీఎస్టీ అధికంగా విధిస్తారన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. గతంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు, కూలర్లు, వాషింగ్ మెషిన్లు, ఓవెన్స్, వాచీలు, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలకు సంబంధించి ఇప్పటికే వ్యాపారుల వద్ద చాలా స్టాకు మిగిలింది. జీఎస్టీ అమలులోకి వస్తే పన్ను అధికంగా వేస్తారన్న భయంతో కొందరు వ్యాపారులు ఆయా వస్తువుల ధరలపై ఐదు నుంచి పది శాతం తగ్గింపుతో విక్రయించేస్తున్నారు. దీంతో వినియోగదారులు కూడా ధరలు పెరుగుతాయనే భయంతో ఇప్పుడే వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వ్యాపార వర్గాల్లో జీఎస్టీపై ఆందోళన అవసరం లేదని, పెద్ద మొత్తంలో స్టాకు కొనుగోలు చేసి విక్రయించకుండా తమ వద్ద ఉన్నవారు గతంలో అధిక పన్నులు చెల్లించిన పక్షంలో జీఎస్టీలో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, జీఎస్టీ అమలుతో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల ధరలు సుమారు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. దిగిరానున్న నిత్యావసరాల ధరలు.. గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. ఇందులో 70 శాతానికిపైగా అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల వారే. ప్రతినెలా వీరంతా ఇంటి అవస రాలకు బియ్యం, గోధుమలు, పాలు, పప్పులు వంటి ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తారు. వీటిపై జీఎస్టీ తగ్గించడంతో ఆయా ధాన్యాలపై కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు ధర తగ్గే అవకాశాలున్నాయి. వంటనూ నెలపైనా పన్ను తగ్గడంతో లీటర్ నూనెపై ఇదే స్థాయిలో ధర తగ్గుముఖం పడతాయి. తలనూనె, సబ్బులు, టూత్‌పేస్టులపైనా పన్ను 24 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో వీటి ధరలు రూ.5 నుంచి రూ.8 వరకూ తగ్గే అవకాశాలున్నాయి. దీంతో వేతనజీవులు, నిరు పేదల నెల బడ్జెట్ తగ్గుతుంది. వేతనజీవులు నెలవారీగా నిత్యా వసరా లకు రూ.5 వేలు ఖర్చు చేస్తుంటే.. జూలై నుంచి వారికి నెలకు రూ.500–1,000 వరకు మిగులు ఉండే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. విలాస వస్తువులపైనే అధికం.. జీఎస్టీ విలాస వస్తువు లపైనే అధికంగా ఉంది. నిత్యావసరాలపై తక్కువగా ఉంది. ఈ పన్ను పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటగానే ఉంది. న్యాయంగా వ్యాపారం చేసేవారికి జీఎస్ టీ బాగానే ఉంటుంది. దొంగ వ్యాపారులకే ఇబ్బందికరం. – జి.గోపాల్, వ్యాపారి 5 శాతానికి పరిమితం చేయాలి నాన్ ఏసీ హోటల్స్‌కు12%, ఏసీ హోటల్స్‌కు 18% జీఎస్టీ విధించడంతో భోజన ప్రియులు హోటళ్లకు దూరమయ్యే పరిస్థితి ఉంది. జీఎస్టీ వల్ల హోటళ్ల గిరాకీపై తీవ్ర ప్రభావం పడ నుంది. హోటళ్లపై జీఎస్టీని 5 శాతానికే పరిమితం చేయాలి. – కిషన్‌యాదవ్, నందిని గ్రూప్ ఆఫ్ హోటల్స్ మిగిలిన స్టాకుపై పన్ను వద్దు రెడీమేడ్ దుస్తులపై 23 శాతం జీఎస్టీ వి«ధించడం సబబుగాలేదు.గతంలో వీటిపై పన్ను చాలా తక్కువగా ఉండే ది. ప్రస్తుతం మా వద్ద ఉన్న స్టాక్ పై పన్ను విధించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని తెలిసింది. దీనిని తక్షణం ఉపసంహరించు కోవాలి. – ప్రసాద్, వ్యాపారి, బడీచౌడీ -
ప్రజలందరికీ ఇళ్లు, కార్లు, ఏసీలు
న్యూఢిల్లీ : అందరికీ అందుబాటులో గృహాలు అనే ధృడసంకల్పంతో ముందుకెళ్తున్న కేంద్రప్రభుత్వం, భారత్ కు కొత్త రూపు తీసుకురావాలని యోచిస్తోంది. వచ్చే 15 ఏళ్లలో ప్రజలందరికీ గృహాలు, టూ-వీలర్స్ లేదా కార్లు, పవర్, ఎయిర్ కండీషనర్లు, డిజిటల్ కనెక్టివిటీ ఉండేలా ప్లాన్ వేస్తోంది. ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ ఈ మేరకు ఓ విజన్ ను రూపొందించింది. 2031-32 పేరుతో తీసుకొచ్చిన ఈ విజన్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా గవర్నింగ్ కౌన్సిల్ ముందు ఉంచారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదివారం జరిగిన భేటీలో అరవింద్ పనగారియా దీన్ని ప్రజెంట్ చేశారు. పూర్తిస్థాయి అక్షరాస్యత గల సమాజాన్ని ఏర్పాటుచేసి, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని ప్రజలకు అందించాలని నీతి ఆయోగ్ ఈ విజన్ ను రూపొందించింది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో నాణ్యతమైన గాలి, నీటి సదుపాయాలను అందుబాటులో ఉంచేలా.. రోడ్డులు, రైల్వేలు, వాటర్ వేస్, ఎయిర్ కనెక్టివిటీ, క్లీన్ ఇండియా విస్తరింపజేయాలని నీతి ఆయోగ్ విజన్ పేర్కొంది. 2031-32 వరకు ఒక్కొక్కరి తలసరి ఆదాయం కూడా మూడింతలు పెంచి 3.14 లక్షలకు చేర్చాలని ప్రతిపాదించింది. అంతేకాక, స్థూల దేశీయోత్పత్తి లేదా ఎకానమీ 2031-32 లోపల 469 లక్షల కోట్లకు పెంచాలన్నది లక్ష్యంగా నీతి ఆయోగ్ నిర్దేశించింది. కేంద్ర, రాష్ట్రాల వ్యయాలను 92 లక్షల కోట్లకు పెంచాలని తన విజన్ లో పేర్కొంది. ''మనం కచ్చితంగా భారత్ ను సంపన్నవంతగా, ఆరోగ్యకరంగా, సురక్షితంగా, అవినీతి రహితంగా, శక్తి సామర్థ్య దేశంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలి దేశంగా, క్లీన్ ఎన్విరాన్మెంటల్ గా తీర్చిదిద్దాల్సి ఉందని'' ఈ విజన్ లో నీతి ఆయోగ్ తెలిపింది. -
నిమ్స్‌కు ఉక్కపోత
► పని చేయని ఏసీలు ► ఉక్కపోతతో బాధితుల అవస్థలు ► రోగులే ఫ్యాన్లు సమకూర్చుకుంటున్న వైనం సాక్షి, సిటీబ్యూరో: వారు వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు. ఒంటినిండా సిమెం ట్ కట్లు...ఆపై భరించలేని నొప్పి.... చల్లని గాలికి సేద తీరాల్సిన క్షతగాత్రులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో గాయాలు మానక పోగా, ఉక్కపోతకు దురద పెట్టి ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో ఏసీలు, ఫ్యాన్లు పని చేయక రోగుల అవస్థలు వర్ణణాతీతం. సాధారణ వార్డుల్లోని రోగులే కాకుండా..వివిధ శస్త్రచికిత్సలు చేయించుకుని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న రోగులు, ఏసీ గదుల్లో ఉన్నవారు ఉక్కపోతకు అల్లాడుతున్నారు. ఉపశమనం కోసం ప్రత్యామ్నాయంగా ఎవరికి వారే ఫ్యాన్లు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. లీకేజీ వల్ల కొన్ని.. గ్యాస్ లేక మరికొన్నిః ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్లుగా మరో వెయ్యిమందికి పైగా చి కిత్స పొందుతుంటారు. వీరిలో ఎక్కువ మంది క్షతగాత్రులు, హృద్రోగులు, న్యూరో సంబంధ రోగులు, కిడ్నీ బాధితులే ఉన్నారు. వీవీఐపీలు చికిత్స పొందే ఈ ఆస్పత్రిలో ప్రత్యేకంగా 60 ఏసీ పెయింగ్ గదులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పదేళ్ల క్రితం అమర్చినవి కావడంతో నిర్వహణ లోపం వల్ల తరచూ మెరాయిస్తున్నాయి. 40 పడకలు ఉన్న ఐసీసీయూలో గ్యాస్ లీకై ఏసీలు పని చేయకపోగా, సీటీఐసీయూలో గ్యాస్ కొరత కారణంగా మొండికేశాయి. ఆర్ఐసీయూలోనూ ఇదే దుస్థితి. సాధారణ వార్డుల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వార్డు నెంబర్ 10-ఎ లోని 12 పడకలు ఉండగా, నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి. ఇవి ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో సరిగా పని చేయడం లేదు. ఆర్థోపెడిక్ వార్డులో ఒంటినిండా సిమెంట్ కట్లతో ఏటూ కదల్లేపోతున్న క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్కపోతకు పట్టీలు వేసిన చోట దురద పుట్టి గాయం మానకుండా చేస్తుంది. డయాలసిస్ వార్డులో కంప్రెషర్ పోవడంతో కిడ్నీ బాధితులు అవస్థలు పడుతున్నారు. ఇక రోగులు డబ్బు చెల్లించి తీసుకున్న ఏసీ గదుల్లోనూ ఏసీలు పని చేయక పోవడంతో వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడువు తీరినవైనందునే ఆస్పత్రిలో చాలా వరకు పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫ్యాన్లే ఉన్నాయి. ఏసీల గడువు కూడా దాటిపోయింది. వీటిని కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటికి ఉష్ణోగ్రతల్లో చాలా మార్పు వచ్చింది. దీంతో సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే వీటిని పునరుద్ధరిస్తాం. రెం డు మూడు రోజుల్లో ఆర్ఐసీయూలో ఏసీ సర్వీసులను పునరుద్ధరిస్తాం. రోగులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తాం. -డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్, నిమ్స్ -
గ్రీన్ హోమ్స్
ఎండాకాలం ఇంట్లో చల్లగా ఉండాలి. చలికాలం ఇంట్లో వెచ్చగా ఉండాలి.. అంటే ఏం చేయాలి? వేసవిలో ఏసీలు, శీతాకాలంలో హీటర్లను ఆన్ చేయాలి. దీనికి ప్రత్యామ్నాయం ఏదీ లేదా? ఉంటే ఆ ప్రత్యామ్నాయం ప్రకృతికి హాని కలిగించనిదైతే ఎంత బాగుంటుందో కదూ! హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ‘గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2014’ ఎగ్జిబిషన్లో ఓ రెండు ప్రదర్శనలు ఏసీలతో, హీటర్లతో అవసరం లేకుండా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా బతికేయొచ్చని అంటున్నాయి. థర్మాకోల్ ఇళ్లు.. థర్మాకోల్‌తో ఇళ్లేంటని ఆశ్చర్యపోకండి. దానంత భద్రం, బలం మరొకటి లేదంటున్నారు చెన్నైకి చెందిన బీర్డ్సెల్ లిమిటెడ్వారు. ఆ కంపెనీ ప్రతినిధి ఉదయ్ మాటల్లో చెప్పాలంటే.. నిప్పుకు సైతం లొంగని దృఢత్వం మా ఇళ్ల ప్రత్యేకత అంటారు. ‘ఐదించుల థర్మాకోల్ అట్టకు రెండువైపులా నాలుగురకాల పూతలు పూసి వాటిని గోడలుగా మలచడం మా స్పెషాలిటీ. థర్మాకోల్ అంటే మామూలుగా వాడేది కాదు. ఎఫ్ఆర్ మెటీరియల్ అని ఉంటుంది. అంటే ఫైర్ రిటార్డెడ్ థర్మాకోల్ అన్నమాట. దీన్ని మాకు కావాల్సిన ఆకారాల్లో తయారుచేసుకుని వాటిని గోడల మధ్యలో పెడతాం. దీని వల్ల అగ్నిప్రమాదం జరిగినపుడు మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా, గోడలు పగిలిపోకుండా థర్మాకోల్ కాపాడుతుందన్నమాట. అదెలాగంటే.. అగ్ని ప్రమాదం జరిగినపుడు గోడలు కూడా వేడెక్కిపోయి పగిలిపోతాయి. మా థర్మాకోల్ ఇళ్ల వల్ల గోడ మధ్యలో ఉన్న థర్మాకోల్ నిప్పుని వేగంగా వ్యాపించకుండా చేస్తుంది. వేడి తగలగానే అక్కడికక్కడే ఉండలా అయిపోయి సిమెంటు మధ్యలో అలాగే ఉండిపోతుంది. బీటలువారే అవకాశం ఇవ్వదు. ఇదిలా ఉంచితే గోడలోపల ఉండే ఎఫ్ఆర్ థర్మాకోల్ వేసవిలో ఇంటిలోపలి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. చలికాలంలో గదుల్లో హీట్ జనరేట్ చేస్తుంది. అగ్నిప్రమాదాల తీవ్రతను తగ్గించే ఇళ్లుగా కంటే వేసవి, చలి కాలాలకు.. ఏసీ, హీటర్ మాదిరిగా ఉపయోగపడటంలో మా థర్మాకోల్ ఇళ్లు చాలా ఫేమస్ అయ్యాయి. నాలుగు నెలల క్రితం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో రెండు పెద్ద ఇళ్లను నిర్మించాం. చెన్నైలో ఏడు ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తిచేశాం’ అని వివరించారు ఉదయ్. టెక్నాలజీ పేరుతో పరిచయమైన ఏసీ, హీటర్‌కు ప్రత్యామ్నాయాలకు కూడా మరో టెక్నాలజీని కనిపెట్టి ముందుకు దూసుకెళ్తున్న వీరికి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం. చెక్కలా ఉంటుంది కానీ.. ప్రీఫ్యాబ్రికేటెడ్ సిమెంట్‌తో కట్టిన ఇల్లు ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుజరాత్‌కి చెందిన ఓ కంపెనీ తరఫున ప్రతినిధిగా అజయ్ ఆ ఇంటి స్పెషాలిటీ గురించి వచ్చిన వారందరికీ వివరించారు. ‘చూడ్డానికి పెంకుటిల్లు మాదిరిగా ఉన్న ఈ ప్రీఫ్యాబ్రికేటెడ్ హౌస్‌లు మన దేశానికి కొత్త. ఆరేళ్లక్రితం గుజరాత్లో ఈ ఇళ్ల నిర్మాణం మొదలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు వందల ఇళ్లు నిర్మించాం. ఈ ఇంటి నిర్మాణానికి మేం ప్రీఫ్యాబ్రికేటడ్ సిమెంట్‌ని వాడుతున్నాం. చూడ్డానికి మాత్రం చెక్కతో కట్టిన ఇల్లు మాదిరిగా ఉంటుంది. గోడ పూతంతా ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో ఉంటుంది. దీని కారణంగా.. వేసవిలో ఇంట్లో వాతావరణం చల్లగా ఉంటుంది. బయట నలభై డిగ్రీల వేడి ఉంటే.. ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది. ఫ్యాన్లతో కూడా పని ఉండదు. గోడకు వేసే కోటింగ్‌ని బట్టి ఇంట్లో ఉండే చల్లదనం ఆధారపడి ఉంటుందన్నమాట. ఎక్కువగా ఉత్తరాదివారే ఈ ఇళ్లను ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ వాసులు కూడా వీటిపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం మా చేతిలో నగరానికి సంబంధించి రెండు ఆర్డర్లు ఉన్నాయి. ఈ మధ్యనే భువనగిరిలో ఒక ఫామ్‌హౌస్ కట్టాం.’ అని చెప్పారు అజయ్. ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇళ్లకున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. సౌండ్‌ఫ్రూఫ్. అలాగే గోడలు చాలా బలమైనవి కూడా. మిగతా ఇళ్లతో పోలిస్తే ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇళ్ల ఖరీదు ఇరవైశాతం మాత్రమే ఎక్కువట. - భువనేశ్వరి -
మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు
సాక్షి, బళ్లారి : బిసల బళ్లారిలో మళ్లీ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. 45 డీగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోవడంతో ఎండల వేడికి నగర ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండవేడమి తట్టుకోలేక ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయల నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఎండలు బలంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల వద్ద జనం కిటకిటలాడుతున్నారు. బళ్లారితోపాటు జిల్లా వ్యాప్తంగా కంప్లి, హొస్పేట, సిరుగుప్ప, హడగలి, హగరిబొమ్మనహళ్లి తదితర నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల జనం ఉక్కపోత భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో ఉదయం నుంచి 24 గంటలు ఫ్యాన్లు, ఏసీలు పెట్టుకున్నా చల్లబటం లేదని నగర వాసులు అంటున్నారు.