జీఎస్టీ కాక .. డిస్కౌంట్ల మోత
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చట్టం జూలై 1 నుంచి అమలుకాబోతున్న నేపథ్యంలో దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. తుదిగడువు దగ్గర పడే కొద్ది నిల్వలు వదిలించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈనేపథ్యంలో పేటియం నుంచి షాప్‌క్లూస్ దాకా, లెవీస్ మొదలుకొని బజాజ్ ఆటో వరకు, బ్రాండ్స్ నుంచి రిటైలర్స్ దాకా అన్ని కంపెనీలు భారీ డిస్కౌంట్‌ను ప్రకటిస్తున్నాయి.అన్ని ఈ- కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫాం ద్వారా విక్రయాలు జరిపే ఉత్పత్తులపై అధిక మొత్తంలో తగ్గింపులను ప్రకటిస్తున్నాయి.
ఇవిగో కొన్ని ఆఫర్లు...
► మెడిసిన్స్ పై 20 శాతం తగ్గింపును 1ఎంజీడాట్ కామ్ ప్రకటించింది.
► స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ పుమా కంపెనీ ఫ్లాట్ 40 శాతం డిస్కౌంట్‌పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.
► వస్త్ర ఉత్పత్తి కంపెనీ అల్లెన్ సోలీ కస్టమర్లకు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇస్తోంది.
► లెవీస్ కంపెనీ బై టు గెట్ టు ఆఫర్‌ను ఇస్తుండగా... ఫ్లైయింగ్ మేషిన్ కంపెనీ 50 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది.
► బజాజ్ ఆటో వివిధ మోడల్స్ పై కోనుగోలు దారులకు రూ.4500 దాకా డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది.
► సెల్‌ఫోన్లపై పలు డిస్కౌంట్లను పలు కంపెనీలు ప్రకటించనున్నాయి.