సాక్షి, ముంబై: కొత్త ఏడాదిలో కొత్త కారును సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారా. అయితే మీకో బంపర్ ఆపర్. మహీంద్రా అండ్ మహీంద్రా తన అన్ని మోడల్ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన థార్ ఎస్‌యూవీ మినహా దాదాపు అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లోఅందించిన సమాచారం ప్రకారం బీఎస్-6 వాహనాలపై ఏకంగా 3.06 లక్షల వరకు తగ్గింపు లభించనుంది. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ , అదనపు ఆఫర్లు ఇందులో భాగం. ఈ ఆఫర్ ఈ నెల(డిసెంబర్ 31, 2020)చివరి వరకు మాత్రమే చెల్లుతాయి. అలాగే ఆయా నగరాలు, ప్రాంతాల ఆధారంగా డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ( రూ. 440 కోట్లు నష్టం : వేలాది ఐఫోన్లు మాయం)
Comments
Please login to add a commentAdd a comment