ఏసీలు, ఫ్రిడ్జ్‌లు మరింత కాస్ట్‌లీ | Fridge, AC to cost more from next month | Sakshi
Sakshi News home page

ఏసీలు, ఫ్రిడ్జ్‌లు మరింత కాస్ట్‌లీ

Published Mon, Oct 30 2017 10:25 AM | Last Updated on Mon, Oct 30 2017 10:28 AM

Fridge, AC to cost more from next month

ముంబై : ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మెషిన్ల ధరలు మరింత కాస్ట్‌లీగా మారబోతున్నాయి. వచ్చే నెల నుంచి వీటి ధరలు 3-5 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పెరిగిన ఇన్‌పుట్‌ వ్యయాల మేరకు ధరలు పెంచాలని ఈ వైట్‌ గూడ్స్‌ తయారీదారులు ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో వీటి ధరలు పెరుగబోతున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. గత ధరల పెంపు నుంచి ఇప్పటి వరకు ఇన్‌పుట్‌ వ్యయాలు 30-35 శాతం మేర పెరిగినట్టు తెలిసింది. స్టీల్‌ ధర 40 శాతం, కాపర్‌ ధర 50 శాతం పెరగడంతో పాటు రిఫ్రిజిరేట​ర్లలో ఎక్కువగా వినియోగించే కీలక కెమికల్‌ ఎండీఐ అంతర్జాతీయంగా లోపించింది. దీంతో ఇన్‌పుట్‌ వ్యయాలు రెండింతలు పైకి ఎగిశాయి. 

ఈ మూడు కలిపి ఇన్‌పుట్‌ వ్యయాల్లో 70 శాతం మేర నమోదవుతున్నాయి.. దీంతో వైట్‌ గూడ్స్‌ ధరలపై నికరంగా 5-6 శాతం ప్రభావం పడనుందని గోద్రెజ్‌ అప్లియెన్స్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది చెప్పారు. దీనిలో కొంత కంపెనీలు భరించి, మిగిలిన మొత్తం వినియోగదారులపై విధించనున్నట్టు పేర్కొన్నారు. తొలుత రిఫ్రిజిరేటర్ల ధరలు పెంచుతామని వచ్చే నెల నుంచి ఈ పెంపు ఉంటుందని నంది తెలిపారు. తర్వాత వాషింగ్‌ మిషన్లు, అనంతరం జనవరి నుంచి ఏసీ ధరల సమీక్ష ఉంటుందన్నారు. వైట్‌ గూడ్స్‌లో మార్కెట్‌ లీడర్లుగా ఉన్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా, దాని ప్రత్యర్థి శాంసంగ్‌లు కూడా ఈ కేటగిరీ ఉత్పత్తులపై ధరల పెంపుకు సన్నాహాలు చేస్తున్నాయని దిగ్గజ రిటైల్‌ చైన్‌ చీఫ్‌ చెప్పారు. అయితే శాంసంగ్‌ ధరల పెంపును ఖండించగా.. ఎల్‌జీ ఇంకా స్పందించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement