
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రముఖ దిగ్గజ కంపెనీలు అయిన ఓలా, మహేంద్ర ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో ముందుంజలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు కంపెనీలు ఒక ఉమ్మడి అంశంపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఇంతకీ ఆ ఉమ్మడి అంశం ఏమిటంటే ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో మొత్తం మహిళా కార్మకులే నిర్వహిస్తారని ఓలా సీఈవో భవేశ్ అగర్వాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
(చదవండి: కోవిడ్ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు)
ఈ మేరకు 2022 కల్లా దాదాపు 10 మిలయన్ల స్కూటర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరుణంలో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో 'గర్ల్ పవర్' వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వినియోగదారులతో పంచుకున్నారు. అలానే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర నేపాల్‌లోని మహేంద్ర కంపెనీ కూడా మొత్తం మహిళా శక్తి బృందంతోనే ట్రియో ఎలక్ట్రిక్ ఆటోను ప్రారంభించినట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్ర మొత్తం మహిళా బృందాన్ని అభినందిస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే ఓలా సీఈవో భవిశ్ ఈ ఫ్యూచర్ ఫ్యాక్టరీ పూర్తిగా మహిళ సామర్థ్యంతో పనిచేయడమే కాక దాదపు 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించి ప్రపంచవ్యాప్తంగా మహిళలతో కూడిన ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా ఉంటుందని ముందుగానే ప్రకటించడం గమనార్హం.
ఈ మేరకు భవిశ్ అగర్వాల్ ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్న మహిళల వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రెండు దిగ్గజ కంపెనీలు 'గ్రీన్ పవర్' పేరుతో మహిళా శక్తి పైనే దృష్టి కేంద్రీకరించారంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు)
Sneak peak of the scooters in production. The women at our Futurefactory are ramping up production fast! #JoinTheRevolution @OlaElectric pic.twitter.com/Z0eanudV8X
— Bhavish Aggarwal (@bhash) October 27, 2021