
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జీక్యూజీ పార్ట్‌నర్స్ 4.7 శాతం వాటా చేజిక్కించుకుంది. బ్లాక్ డీల్స్ ద్వారా ఒక్కొక్కటి రూ.59.09 చొప్పున సుమారు 29 కోట్ల షేర్లను రూ.1,672 కోట్లు వెచి్చంచి కొనుగోలు చేసింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో శుక్రవారం మొత్తం 3 ప్రధాన బ్లాక్ డీల్స్ ద్వారా ఒక్కో షేరు రూ.58.2–59.25 చొప్పున 12.6% వాటాలు చేతులు మారాయి. వీటి మొత్తం విలువ రూ.4,465 కోట్లు.
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా కొనుగోలు చేసిన కంపెనీల్లో నోమురా ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, స్టిక్‌టింగ్ డిపాజిటరీ ఏపీజీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ పూల్ సైతం ఉన్నాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో తనకున్న మొత్తం 7.27 శాతం వాటాలను యూకే కంపెనీ ఏఎస్‌ఎన్ ఇన్వెస్ట్‌మెంట్స్ విక్రయించింది. ఏ/డీ ఇన్వెస్టర్స్ ఫండ్, వరేనియం ఇండియా అపార్చునిటీ ఫండ్ సైతం వాటాలను విక్రయించాయి.
Comments
Please login to add a commentAdd a comment