Nomura India
-
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో ‘జీక్యూజీ’కి 4.7 శాతం వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్ 4.7 శాతం వాటా చేజిక్కించుకుంది. బ్లాక్ డీల్స్ ద్వారా ఒక్కొక్కటి రూ.59.09 చొప్పున సుమారు 29 కోట్ల షేర్లను రూ.1,672 కోట్లు వెచి్చంచి కొనుగోలు చేసింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో శుక్రవారం మొత్తం 3 ప్రధాన బ్లాక్ డీల్స్ ద్వారా ఒక్కో షేరు రూ.58.2–59.25 చొప్పున 12.6% వాటాలు చేతులు మారాయి. వీటి మొత్తం విలువ రూ.4,465 కోట్లు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా కొనుగోలు చేసిన కంపెనీల్లో నోమురా ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, స్టిక్టింగ్ డిపాజిటరీ ఏపీజీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ పూల్ సైతం ఉన్నాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో తనకున్న మొత్తం 7.27 శాతం వాటాలను యూకే కంపెనీ ఏఎస్ఎన్ ఇన్వెస్ట్మెంట్స్ విక్రయించింది. ఏ/డీ ఇన్వెస్టర్స్ ఫండ్, వరేనియం ఇండియా అపార్చునిటీ ఫండ్ సైతం వాటాలను విక్రయించాయి. -
కేసులు తగ్గుతున్నాయ్, వ్యాపారాలు పుంజుకుంటున్నాయ్
ముంబై: కొత్త కేసులు క్రమంగా తగ్గే కొద్దీ .. వ్యాపార కార్యకలాపాలు తిరిగి కోవిడ్ సెకండ్ వేవ్ పూర్వ స్థాయికి (మార్చి నాటి) పుంజుకున్నాయని జపాన్ బ్రోకరేజి సంస్థ నొమురా వెల్లడించింది. ఆదివారంతో ముగిసిన వారంలో ఇందుకు సంబంధించిన సూచీ ఎన్‌ఐబీఆర్‌ఐ (నొమురా ఇండియా బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్) 95.7 పాయింట్లకు చేరినట్లు తెలిపింది. అంతక్రితం వారం ఇది 91 పాయింట్లుగా ఉంది. దీంతో వరుసగా సూచీ ఏడో వారం పెరిగినట్లయింది. జూన్ గణాంకాలు చూస్తే సీక్వెన్షియల్‌గా పరిస్థితులు మెరుగుపడినట్లుగా కనిపిస్తుండగా, జులై తొలి నాళ్ల డేటా మిశ్రమంగా ఉందని నొమురా తెలిపింది. మొదటి వారంలో రైల్వే రవాణ ఆదాయాలు, జీఎస్టీ ఈ–వే బిల్లులు తగ్గగా.. విద్యుత్‌కి డిమాండ్ భారీగా పెరగడం ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. జూన్‌లో సగటున రోజుకు 38 లక్షల డోసుల టీకాలు వేయగా, జులైలో ఇప్పటిదాకా వేక్సినేషన్ ప్రక్రియ పెద్దగా పుంజుకోలేదని నొమురా వివరించింది. ఆగస్టు నుంచి మళ్లీ టీకాలు వేయడం వేగవంతం కావచ్చని పేర్కొంది. అయితే, ప్రయాణాలు చేయడం పెరిగే కొద్దీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు కీలకమైన రిస్కుగా ఉండగలవని నొమురా తెలిపింది.