జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో వాటా విక్రయం?!
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో 40 శాతం వాటా కొనుగోలుకు పారిస్ ఎయిర్‌పోర్ట్స్ ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ మేరకు ఒప్పందం కుదిరితే డీల్ విలువ రూ.8-10 వేల కోట్లు ఉండొచ్చని అంచనా. దీనిద్వారా జీఎంఆర్ రూ.4,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని సమాచారం. జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.37వేల కోట్ల రుణాలున్న విషయం తెలిసిందే. ఈ రుణభారం తగ్గించుకునేందుకు పలు మార్గాలను కంపెనీ పరిశీలిస్తోంది. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో వాటా కొనుగోలుకు పారిస్ ఎయిర్‌పోర్ట్స్‌తో పాటు పీఎస్‌పీ, కేకేఆర్, ఏడీఐఏ సంస్థలు సైతం ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఢిల్లీ విమానాశ్రయంలో జీఎంఆర్‌కు 64 శాతం, హైదరాబాద్ విమానాశ్రయంలో 63 శాతం, సెబు విమానాశ్రయంలో 40 శాతం వాటాలున్నాయి.