
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న కింగ్స్‌వే హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను కైవసం చేసుకుంది. ఈ కొనుగోలు ప్రక్రియలో భాగంగా కింగ్స్‌వే ఆసుపత్రికి రూ.80 కోట్లను కిమ్స్ పెట్టుబడి రూపంలో అందించనుంది.
ఈ మొత్తాన్ని రుణ భారం తగ్గించుకోవడానికి, బ్యాలెన్స్ షీట్ బలోపేతానికి వినియోగిస్తారు. కింగ్స్‌వే హాస్పిటల్స్‌కు 300లకుపైగా పడకల సామర్థ్యం ఉంది. మహారాష్ట్రలో నాసిక్ తర్వాత సంస్థకు ఇది రెండవ కేంద్రం అని కిమ్స్ ఎండీ భాస్కర రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment