మురిపించిన బ్రిటానియా | Britannia - Announces Q1 (Standalone & Consolidated) results, | Sakshi
Sakshi News home page

మురిపించిన బ్రిటానియా

Published Mon, Aug 8 2016 2:26 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

మురిపించిన బ్రిటానియా

మురిపించిన బ్రిటానియా

ముంబై:  బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ క్యూ1 (స్వతంత్ర  అండ్ కన్సాలిడేటెడ్) ఫలితాలను ప్రకటించింది.  బిస్కట్ల దిగ్గజం బ్రిటానియా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలతో  ఆకట్టుకుంది.  జూన్ 30తోముగిసిన తొలి త్రైమాసికంలో  కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 13 శాతం జంప్ చేసి రూ. 219 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం కూడా 9 శాతం  పెరిగి రూ. 2191కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 10 శాతం పెరిగి రూ. 316 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు మాత్రం 14.3 శాతం నుంచి నామమాత్రంగా 14.4 శాతానికి బలపడ్డాయి. ఈ ఫలితాల నేపథ్యంలో  ఈ షేర్  కు  నేటి మార్కెట్ లో  కొనుగోళ్ల ట్రెండ్ నెలకొంది.  దీంతో  బ్రిటానియా షేరు 5 శాతం లాభాలతో  ట్రేడవుతోంది. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement