జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు నిరాశ | Jio Financial Services Q1 Results Net profit declines 6 pc | Sakshi
Sakshi News home page

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు నిరాశ

Published Mon, Jul 15 2024 9:36 PM | Last Updated on Tue, Jul 16 2024 8:56 AM

Jio Financial Services Q1 Results Net profit declines 6 pc

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మొదటి త్రైమాసికంలో నిరాశజనక ఫలితాలను నమోదు చేసింది. 2024 జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం ఫలితాలను కంపెనీ సోమవారం (జూలై 15) వెల్లడించింది.

గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 6% క్షీణించి రూ.312.63 కోట్లకు చేరుకుంది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని రూ.414 కోట్లతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 9% పెరిగి రూ.417.8 కోట్లకు చేరుకుంది.

మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు బీఎస్‌ఈలో రూ.4.90 లేదా 1.40% పెరిగి రూ.355.25 వద్ద ముగిశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement