న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 138 కోట్లకు చేరింది. ఆటోమొబైల్స్‌కు సీఎన్‌జీ విక్రయాలు 61 శాతం జంప్‌చేసి 109 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లను తాకాయి. పైప్‌డ్ వంట గ్యాస్ అమ్మకాలు 3 శాతం పుంజుకుని 74 ఎంఎంఎస్‌సీఎంకు చేరాయి. అయితే సీఎన్‌జీ, వంటగ్యాస్ తయారీకి కొనుగోలు చేసిన సహజవాయు ధరలు మూడు రెట్లు ఎగసి రూ. 785 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. ఈ కాలంలో మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 1,110 కోట్లను తాకింది. నిర్వహణా లాభం 6 శాతం బలపడి రూ. 228 కోట్లుగా నమోదైంది.
చదవండి : OnePlus10T 5G: వన్‌ప్లస్ 10 టీ వచ్చేసింది..ఆఫర్ అదిరింది!
Comments
Please login to add a commentAdd a comment