రూ.194 డివిడెండ్‌ ప్రకటించిన కంపెనీ | MRF announced a final dividend of Rs 194 And Britannia announced Rs 73.5 | Sakshi
Sakshi News home page

రూ.194 డివిడెండ్‌ ప్రకటించిన కంపెనీ

Published Sat, May 4 2024 9:10 AM | Last Updated on Sat, May 4 2024 9:49 AM

MRF announced a final dividend of Rs 194 And Britannia announced Rs 73.5

ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్‌ఎఫ్‌ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.194 డివిడెండ్‌ ప్రకటించింది.

2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్‌ఎఫ్‌ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది. 2022-23 నికరలాభం రూ.769 కోట్లుగా కంపెనీ పోస్ట్‌ చేసింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు చెప్పింది.

మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.341 కోట్లతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున సంస్థ అందించింది.

ఇదీ చదవండి: నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు.. కారణం..

బ్రిటానియా రూ.73.50 డివిడెండ్‌

బ్రిటానియా ఇండస్ట్రీస్‌ మార్చి త్రైమాసికంలో రూ.536.61 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో నమోదుచేసిన లాభం రూ.557.60 కోట్ల కంటే ఇది తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4023.18 కోట్ల నుంచి 1.14% పెరిగి రూ.4069.36 కోట్లకు చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.73.50 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement