MRF
-
ఒకేరోజు రూ.3.53 నుంచి రూ.2.36 లక్షలకు చేరిన స్టాక్!
ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే స్మాల్ క్యాప్ స్టాక్ భారీగా పెరిగి రికార్డు నమోదు చేసింది. అక్టోబర్ 29న పెరిగిన స్టాక్ విలువ ఏకంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్లోనే ఖరీదైన స్టాక్‌గా మారింది. ఈ స్టాక్ ధర ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 66,92,535 శాతం దూసుకుపోయింది. దాంతో గతంలో రూ.3.53గా ఉండే స్టాక్ ధర కాస్తా రూ.2,36,250కు చేరింది. ఇండియాలోనే ఇప్పటి వరకు ఖరీదైనా స్టాక్‌గా ఉన్న ఎంఆర్ఎఫ్ షేర్ ధర రూ.1.2 లక్షలును మించిపోయింది.షేర్ ధర రూ.3.53 వద్ద ఎందుకుందంటే..2011 నుంచి ఒక్కో షేరు ధర దాదాపు రూ.3గా ఉంది. కానీ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కో షేర్ పుస్తక విలువ(వాస్తవ విలువ) రూ.5,85,225గా ఉంది. ఇలా కంపెనీ స్టాక్‌ల వాస్తవ విలువ ఆకర్షణీయంగా ఉండడంతో కంపెనీ షేర్లు ఎవరూ అమ్మడానికి ఇష్టపడలేదు. దాంతో షేర్ల ట్రేడింగ్ కొరత ఎక్కువైంది. తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ల కారణంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిపేశారు. ఫలితంగా దాదాపు ఒక దశాబ్దం పాటు స్టాక్ ధర సింగిల్ డిజిట్‌లోనే ఉంది.ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’ఎందుకు అంత పెరిగిందంటే..ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాల్యుయేషన్‌కు అనుగుణంగా ప్రత్యేక సెషన్‌ను నిర్వహించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ ఆదేశించింది. దాంతో ఎల్సిడ్ వాటాదారుల పంట పండినట్లయింది. కొత్త మెకానిజంలో భాగంగా లిక్విడిటీని మెరుగుపరచడం, సరసమైన ధరల ఆవిష్కరణను సులభతరం చేయడం లక్ష్యంగా హోల్డింగ్ కంపెనీలకు ఎటువంటి ప్రైస్ బ్యాండ్లు విధించలేదు. దాంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నిర్వహించిన ప్రత్యేక కాల్ ఆక్షన్ సెషన్లో స్టాక్ ధర భారీగా పెరిగింది. మంగళవారం కొన్ని షేర్లు చేతులు మారిన తర్వాత, బుధవారం ఉదయం ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగలేదు. -
రూ.194 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.194 డివిడెండ్ ప్రకటించింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్ఎఫ్ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది. 2022-23 నికరలాభం రూ.769 కోట్లుగా కంపెనీ పోస్ట్ చేసింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు చెప్పింది.మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.341 కోట్లతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున సంస్థ అందించింది.ఇదీ చదవండి: నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..బ్రిటానియా రూ.73.50 డివిడెండ్బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసికంలో రూ.536.61 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో నమోదుచేసిన లాభం రూ.557.60 కోట్ల కంటే ఇది తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4023.18 కోట్ల నుంచి 1.14% పెరిగి రూ.4069.36 కోట్లకు చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.73.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. -
బెలూన్ బొమ్మలమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ
భారతీయ స్టాక్‌మార్కెట్ చరిత్రలో ఆటోమొబైల్ టైర్ మేజర్ ఎంఆర్ఎఫ్ స్టాక్ మరో సారి తన ప్రత్యేకతను చాటుకుంది, టైర్ పరిశ్రమలో అగ్రస్థానంలోఉన్న ఎంఆర్ఎఫ్ షేరు (జూన్ 13, 2023)న తొలిసారి లక్ష మార్క్‌ను టచ్ చేసింది. ఈ ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అసలు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఫౌండర్ ఎవరు? ఈ కంపెనీ విజయ ప్రస్థానం ఏమిటి? ఒకసారి చూద్దాం. ఎంఆర్ఎఫ్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. దేశంలోని అతిపెద్ద టైర్ కంపెని ఫౌండర్ కేఎం మామ్మెన్ మాప్పిళ్లై . ఆయన అంకితభావం, కృషి పట్టదలతో ఈ రోజు ఈ స్థాయికి ఎగిసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, 1946 సంవత్సరంలో, కేఎం మమ్మెన్ మాప్పిళ్ళై మద్రాసు వీధుల్లో బెలూన్లు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచారు.తొమ్మిది మంది తోబుట్టువులతో, కేరళలో సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన మమ్మన్‌కు ఈ బెలూన్ల వ్యాపారమే తన విజయానికి సోపానమని ఊహించి ఉండరు. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) మామెన్ తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. అయితే మామెన్ మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్న సమయంలోస్వాతంత్ర్య పోరాటంలో తండ్రిని రెండేళ్లపాటు జైలులో ఉంచారు. 1946లో మామెన్ చిన్న తయారీ యూనిట్లో బొమ్మల బెలూన్లను తయారీతో పారిశ్రామిక జీవితాన్ని షురు చేశారు. ఇది సుమారు 6 సంవత్సరాల పాటు కొనసాగింది. 1952లో టైర్ రీట్రేడింగ్ ప్లాంట్‌కు ఒక విదేశీ కంపెనీ ట్రెడ్ రబ్బర్ సరఫరా చేస్తోందని గమనించడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. అలా రబ్బరు వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) గ్లోబల్ కంపెనీలు అవుట్ తర్వాత మద్రాసులోని చీటా స్ట్రీట్‌లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించారు. 1956 నాటికి రబ్బరు వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంది. నాలుగేళ్లలో మార్కెట్ వాటా 50 శాతానికి చేరుకుంది. పలితంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు భారత మర్కెట్‌నుంచి తప్పుకున్నాయి. అయితే మామెన్ ఇక్కడితో ఆగలేదు టైర్ల తయారీ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రబ్బరు ఉత్పత్తులనుంచి టైర్ పరిశ్రమలోకి మారారు. 1960లో రబ్బర్, టైర్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. అలా అమెరికాకు చెందిన మాన్స్ఫీల్డ్ టైర్, రబ్బర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్ఎఫ్)గా ఆవిష్కరించింది. ట్రెడ్స్, ట్యూబ్‌లు, పెయింట్స్, బెల్ట్‌లు, బొమ్మలు వంటి అనేక ఇతర ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. 1961లో మద్రాస్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. అమెరికాకు రబ్బరు ఉత్పత్తులను ఎగుమతి చేసిన ఘనత 1967లో కంపెనీ అమెరికాకు టైర్లను ఎగుమతి చేసిన భారతదేశంలో మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో వివిధ ప్లాంట్లను ప్రారంభించింది. 1973 సంవత్సరంలో దేశంలో నైలాన్ ట్రావెల్ కారును వాణిజ్యపరంగా తయారు చేసి మార్కెట్ చేసిన తొలి కంపెనీగా అవతరించింది. అలా 1979 నాటికి కంపెనీ పేరు కంపెనీ పేరు విదేశాలకు ఎగబాకింది. ఆ తరువాత అమెరికన్ కంపెనీ మాన్స్ఫీల్డ్ సంస్థలో తన వాటాను విక్రయించడంతో ఎంఆర్ఎఫ్ లిమిటెడ్‌గా మారింది. ఇండియన్ రోడ్లకు సరిపోయే టైర్లు తయారు అంతా బాగానే ఉంది కానీ మాన్స్ఫీల్డ్ టెక్నాలజీ భారతీయ రహదారి పరిస్థితులకు తగినది కాదని మామెన్ గ్రహించాడు. మరోవైపు డన్లప్, ఫైర్‌స్టోన్,గుడ్ఇయర్ వంటి బహుళజాతి కంపెనీల ఆధిపత్యంతో నిలదొక్కుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సొంతంగా,భారతీయ రోడ్లకు అనుగుణం టైర్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టిన మామెన్ ప్రభుత్వ సాయంతో 1963లో తిరువొత్తియూర్‌లోని రబ్బరు పరిశోధనా కేంద్రం తిరువొత్తియూర్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. మార్కెటింగ్‌పై దృష్టి, ఐకానిక్ మజిల్‌మేన్ ఆవిష్కారం అంతేకాదు మార్కెటింగ్‌పై దృష్టి పెట్టారు. అనేక పరిశోధనల తర్వాత, ధృఢమైన మన్నికైన టైర్లకు ప్రతిరూపంగా అలిక్ పదమ్సీ ఐకానిక్ పవర్ఫుల్ ఎంఆర్ఎఫ్ మజిల్ మేన్ చిత్రం వచ్చింది. భారతీయ ప్రకటనల ముఖచిత్రాన్ని మార్చివేసి 1964లో మజిల్‌మేన్ జనాన్ని విపరీతంగా ఆకర్షించింది. టీవీ వాణిజ్య ప్రకటనలు, బిల్‌బోర్డ్‌లలో ఇలా ఎక్కడ చూసినా ఈ పిక్ దర్శనమిచ్చింది. వివిధ ట్రక్ డ్రైవర్ల సర్వే చేసి మరీ పదంశీ దీన్ని రూపొందించారు. అందుఆయనను రాక్‌స్టార్ లేదా గాడ్ ఆఫ్ మార్కెటింగ్ అని పిలుస్తారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతినార్జించింది ఎంఆర్ఎఫ్. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా మొదలు విరాట్ కోహ్లీ వరకు పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. 80 ఏళ్ల వయసులో 2003లో మాప్పిళ్ళై కన్నుమూశారు. అనంతరం అతని కుమారులు వ్యాపారాన్ని చేపట్టారు. 1992లో మాప్పిళ్లై పరిశ్రమకు చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డును అందుకున్నారు . అతని సోదరులు, KM చెరియన్, KM ఫిలిప్ , KM మాథ్యూ మేనల్లుడు మామెన్ మాథ్యూ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతలే. పెద్ద సోదరుడు కెఎమ్ చెరియన్ కూడా పద్మభూషణ్ గ్రహీతలు కావడం విశేషం. ఈ ఏడాది కంపెనీ ఆదాయం రూ. 23,261.17 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఇది రూ. 19,633.71 కోట్లుగా ఉంది. కంపెనీ నికర లాభం రూ.768.96 కోట్లు నమోదైంది. ఎంఆర్ఎఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.42,000 కోట్లు. -
లాభాల జోరు: ఎంఆర్ఎఫ్ రికార్డ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభంనుంచీ లాభాల్లో కొనసాగిన సూచీలు చివరి వరకు అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. ప్రధానంగా రియల్టీషేర్లు లాభాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. 418 పాయింట్లు లాభంతో 63,143వద్ద 119 పాయింట్ల లాభంతో నిఫ్టీ 18,720 వద్ద ముగిసాయి. దాదాపు టాటా కన్జ్యూమర్స్, టైటన్, సిప్లా, ఏసియన్ పెయింట్స్ భారీగా లాభపడగా, కోటక్ మ హీంద్ర, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో రూపాయి 8 పైసలు పెరిగింది. ఏప్రిల్ 2023లో 4.7శాతంగా సీపీఐ ద్రవ్యోల్బణం మే 2023లో 4.25శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. విశేషం ఏమిటంటే , ఎంఆర్‌ఆఫ్ రికార్డ్ ప్రఖ్యాత రబ్బరు టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ మరోసారి ఆకాశానికి దూసుకుపోయింది. ఎంఆర్ఎఫ్ షేరు తొలిసారి లక్ష మార్క్‌ను టచ్ చేసింది. అంతేకాదు రానున్న కాలంలో షేర్ ధర రూ.1.47 లక్షల మార్కును చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్‌గా నిలిచింది. ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, మార్కెట్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
పీఎం కేర్స్‌కు బజాజ్ ఫిన్సర్వ్ 10 కోట్లు
ముంబై: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ అనే ప్రత్యేక నిధికి బజాజ్ ఫిన్సర్వ్, ఆ సంస్థ ఉద్యోగులు సంయుక్తంగా రూ.10.15 కోట్ల విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ నివారణకు రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు గతంలోనే బజాజ్ గ్రూపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎంఆర్ఎఫ్ రూ.25 కోట్లు: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ సైతం కరోనా వైరస్ నివారణ చర్యలకు మద్దతుగా రూ.25 కోట్లను ప్రకటించింది. కోల్ ఇండియా రూ.221 కోట్లు: ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా కరోనా వైరస్ నివారణ కోసం భూరీ విరాళాన్ని ప్రకటించింది. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.221 కోట్లను అందించినట్టు తెలిపింది. -
ఎమ్ఆర్ఎఫ్ లాభం రూ.263 కోట్లు
న్యూఢిల్లీ: టైర్ల కంపెనీ ఎమ్ఆర్ఎఫ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 12 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.263 కోట్లకు తగ్గిందని ఎమ్ఆర్ఎఫ్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.3,660 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.4,005 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది. మూరత్ ట్రేడింగ్‌లో భాగంగా బుధవారం నాడు బీఎస్ఈలో ఎమ్ఆర్ఎఫ్ షేర్ 0.7 శాతం లాభంతో రూ.65,485 వద్ద ముగిసింది. -
ఎమ్ఆర్ఎఫ్ లాభం 20 శాతం అప్
న్యూఢిల్లీ: టైర్ల కంపెనీ ఎమ్ఆర్ఎఫ్ గత ఆర్థిక సంవత్సరం జనవరి– మార్చి క్వార్టర్లో రూ.345 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో వచ్చిన రూ.287 కోట్ల నికర లాభంతో పోలిస్తే 20 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.3,778 కోట్ల నుంచి రూ.3,945 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.54 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,486 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 24 శాతం క్షీణించి రూ.1,132 కోట్లకు తగ్గింది. -
దారుణంగా పడిపోయిన ఎంఆర్ఎఫ్ లాభాలు
ముంబై: టైర్ల తయారీ దిగ్గజ కంపెనీ ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ లాభాలు దారుణంగా పడిపోయాయి. ఎంఆర్ఎఫ్ క్యూ 1 లో నికర లాభం 78 శాతం క్షీణించింది. ఉత్పత్తి ఖర్చలు పెరగడం మూలంగా కంపెనీ లాభాలు క్షీణించాయని మార్కెట్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికానికి నికర లాభం 78.30 శాతం పడిపోయింది. రూ. 106.53 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు కంపెనీ బిఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికరలాభం రూ. 490.93 కోట్లుగా నమోదైంది. అలాగే ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 4,060.93 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .3,955.93 కోట్లు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయం 21.01 శాతం పెరిగి రూ .3,926.31 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ .3,244.45 కోట్లు. దీంతో స్టాక్‌మార్కెట్ లో బాహుబలి షేరుగా పేరొందిన ఎంఆర్ఎఫ్ స్టాక్ బిఎస్ఇలో 2.57 శాతం నష్టపోయి 67,400 రూపాయల వద్ద ముగిసింది. -
‘మార్కెట్ బాహుబలి’ ఎంఆర్‌ఆఫ్ జోరు
ముంబై: మార్కెట్ ఎనలిస్టులు అంచనాలను అధిగమించి మార్కెట్ బాహుబలి ఎంఆర్ ఆఫ్ మరో కీలక రికార్డ్ స్థాయిని తాకింది. లాభాల స్వీరణతో మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో పయనిస్తుండగా మరోసారి టైర్ స్టాక్స్ ర్యాలీ మాత్రం ఈరోజుకూడా కొనసాగుతోంది. ముఖ్యంగా మార్కెట్ లీడర్ ఎంఆర్ఎఫ్ ఎంఆర్‌ఆఫ్ నిన్నటి హవాను కొనసాగిస్తోంది. రూ. 70,164.60 వద్ద రికార్డ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇంట్రాడేలో గరిష్టాన్ని తాకిన ఈ షేర్ మార్కెట్ లో ’బాహుబలి’ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతంఈ గరిష్టాని స్వల్పంగా వెనక్కి తగ్గి 1.36శాతంలాభంతో 69, 784 వద్ద కొనసాగుతోంది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 30,000 కోట్లను తాకడం విశేషం. ఇదే బాటలో సియట్ జేకే టైర్స్ అపోలో టైర్స్ పయనిస్తున్నాయి. మరోవైపు ఎఫ్ అండ్ వో సిరీస్ ముగింపు నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది.నిన్న రికార్డ్ ఆల్ టైం హైని టచ్ చేయడంతో మదుపర్లు అమ్మకాలకు దిగి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
సాహొరే ‘బాహుబలి’ షేర్
ముంబై:బుల్ రన్లో మార్కెట్ లీడర్ ఎంఆర్‌ఆఫ్ మరోసారి బాహుబలిగా నిలిచింది. ముఖ్యంగా రికార్డ్ స్థాయి లాభాలతో దూసుకుపోతున్న మార్కెట్లలో మరోసారి టైర్ స్టాక్స్‌కు డిమాండ్ కనిపిస్తోంది. మదుపర్ల కొనుగోళ్లతో టైర్ సెక్టార్ ఆకర్షణీయంగా ఉంది. దీంతో ఇటీవల భారీ లాభాలతో రికార్డ్ ధరను నమోదు చేసిన బాహుబలి షేర్ ఎంఆర్ఎఫ్ 5 శాతం జంప్‌చేసి ఒక దశలో రూ. 69,848 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది. అంతేకాదు ఎంఆర్‌ఆఫ్ రూ.70వేల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అంతర్జాతీయ రబ్బరు ధరలు క్షీణత, డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రబ్బర్ షేర్లపై బుల్లిష్ ట్రెండ్‌ను అంచనా వేస్తున్నారు. టీవీఎస్ శ్రీచక్ర 7 శాతం ఎగసి రూ. 4169కు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6 శాతం దూసుకెళ్లి రూ. 1554కు చేరగా.. సియట్ దాదాపు 4 శాతం ఎగసి రూ. 1519ను తాకింది. ఇక జేకే టైర్స్ 2.4 శాతం పెరిగి రూ. 163కు చేరగా, అపోలో టైర్స్ 2.2 శాతం బలపడి రూ. 248 వద్ద ట్రేడవుతోంది. -
షం‘షేర్’.. ఎంఆర్ఎఫ్!
⇔ షేరు ధర @ రూ.63,350 ⇔ భారత్‌లో అత్యంత ఖరీదైన షేర్ ఇదే ⇔ అమెజాన్, గూగుల్, యాపిల్ షేర్ల కంటే కూడా ఎక్కువే... ఎంఆర్ఎఫ్ షేర్ ధర రూ.63,000 దాటింది. బుధవారం బీఎస్ఈలో ఈ షేర్ 1 శాతం లాభంతో రూ.63,350 వద్ద ముగిసింది. ఇది జీవిత కాల గరిష్ట స్థాయి. భారత స్టాక్ మార్కెట్లో ఇదే అత్యంత ఖరీదైన షేర్. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండటంతో గత 5–6 ఏళ్లలో ఈ షేర్ బాగా లాభపడింది. 2011, మార్చి 29న రూ.6,324గా ఉన్న ఈ కంపెనీ షేర్ గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.50,000కు చేరింది. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులున్నా, వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉన్నా ఈ షేర్ నిలకడగా పెరుగుతోంది. ముడి సరకు ధరలు పెరిగినా, తగ్గినా, అమ్మకాలు తగ్గినా, పెరిగినా, వాహన పరిశ్రమ స్థితిగతులతో నిమిత్తం లేకుండా ఈ షేర్ పెరుగుతూనే వస్తోంది. పదేళ్లలో 50 రెట్లు!! ఈ దశాబ్దం ప్రారంభం నుంచి చూస్తే, ఎంఆర్ఎఫ్ షేర్ 4,759 శాతం, లేదా 50 రెట్లు పెరిగి మార్చి 24 నాటికి రూ.59,184కు పెరిగింది. 2001, జనవరి 1న ఈ షేర్ ధర రూ.1,218. అదే ఏడాది అక్టోబర్ 9న ఈ షేర్ రూ.464 కనిష్ట స్థాయికి పడిపోయింది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మార్చి కాలానికి ఈ షేర్ రూ.40,546 నుంచి రూ.60,000కు ఎగసింది. మీరు కనుక 2001లో రూ.500 పెట్టి ఎంఆర్ఎఫ్ షేర్ కొనుగోలు చేశారనుకుందాం. ఇప్పుడు దాని విలువ రూ.63,350. 16 ఏళ్లలో 127 రెట్లు లేదా 12,570% పెరిగింది. సరిగ్గా ఈ షేర్ ధర ఏడాది క్రితం రూ.36,781. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్ ధర 72% పెరిగింది. ఇక ఈ ఏడాది రెండో తేదీన ఈ షేర్ ధర రూ.49,180గా ఉంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్ ధర 29% ఎగబాకింది. గత నెల 27న ఈ కంపెనీ షేర్ రూ.60,000 (డాలర్ల పరంగా చూస్తే 924 డాలర్లు)ను దాటింది. భారత స్టాక్ మార్కెట్లో రెండో ఖరీదైన షేర్ ఐషర్ మోటార్స్ ధర రూ.25,500తో పోలిస్తే ఎంఆర్ఎఫ్ షేర్ ధర రెండు రెట్ల కంటే అధికం. ఇక అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజ షేర్లతో పోల్చినా.. అమెజాన్(856 డా లర్లు), గూగుల్(840 డాలర్లు), యాపిల్(143 డాలర్లు), ఎంఆర్ఎఫ్ షేర్ ధరే అధికంగా ఉంది. రూ.14,000 పెట్టుబడులతో.. మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీగా (ఎంఆర్ఎఫ్) ఒక ఇంట్లోని పెరట్లో బొమ్మలు, గర్బనిరోధక ఉత్పత్తులతో 1946లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఆ తర్వాత కాలంలో అతి పెద్ద భారత టైర్ల కంపెనీగా అవతరించింది. రూ.14,000 పెట్టుబడితో కెఎమ్ మమ్మెన్ మప్ఫిళై తన ఇంటిలో ఎంఆర్‌ఎఫ్‌ను ప్రారంభించారు. మొదట్లో ఈ కంపెనీ బెలూన్లు తయారు చేసేది. ఆ తర్వాత గర్బనిరోధక ఉత్పత్తులు, బొమ్మలు, గ్లోవ్స్‌ను తయారు చేసింది. 1952లో ట్రెడ్ రబ్బర్ రంగంలోకి ప్రవేశించింది. 1961లో స్టాక్మార్కెట్లో లిస్టయింది. టైర్ల తయారీకి అమెరికాకు చెందిన మ్యాన్స్‌ఫీల్డ్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎనిమిది ప్లాంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 65 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఎందుకింత ధర ? ఎంఆర్ఎఫ్–భారత్‌లో అతిపెద్ద టైర్ల కంపెనీ. పెయింట్స్, స్పోర్ట్స్ వస్తువులు, ర్యాలీ స్పోర్ట్స్, టాయ్స్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ షేర్ ధర ఇంతగా ఉండటానికి ప్రధాన కారణం. తక్కువ షేర్లు అందుబాటులో ఉండడమే. ట్రేడింగ్‌కు కేవలం 30 లక్షల షేర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అంచనా... అదే టీసీఎస్ అయితే ట్రేడింగ్‌కు 196 కోట్ల షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండడం కంపెనీకి కలిసొచ్చే మరో అంశం. అమ్మకాల్లో వృద్ధి, మార్జిన్లు, రిటర్న్ ఆన్ ఈక్విటీ నిలకడగా వృద్ధి చెందుతున్నాయి. రీప్లేస్మెంట్ సెగ్మెంట్‌తో పాటు అన్ని రకాల టైర్ల సెగ్మెంట్ల టైర్లలో కంపెనీదే అగ్రస్థానం. అంతేకాకుండా ఇప్పటివరకూ ఈ షేర్‌ను కంపెనీ స్లి్పట్ (విభజన) చేయలేదు. దీనివల్ల తక్కువ మొత్తంలోనే షేర్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా షేర్ల విభజన జరిగితే షేర్ ధర అందరికీ అందుబాటులోకి వస్తుంది. షేర్ల సంఖ్య పెరుగుతుంది. -
ఏకంగా ఆ స్టాక్ ధర రూ.60వేలకు ఎగిసింది!
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ సోమవారం మార్కెట్లో మెరుపులు మెరిపించింది. ఒక్కసారిగా ఆ స్టాక్ ధర రూ.60వేల మార్కును కొల్లగొట్టింది. సోమవారం మధ్యాహ్న ట్రేడింగ్ లో మొదటిసారి ఆ స్టాక్ ధర రూ.60వేల క్రాస్ చేసినట్టు వెల్లడైంది. ఈ కంపెనీ షేరు ధర రూ.59,250 వద్ద ప్రారంభమైంది. అనంతరం ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలోకి రూ.60,140కు చేరుకుంది. చివరికి 1.21 శాతం లాభంతో ఈ కంపెనీ షేరు ధర రూ.59,900 వద్ద ముగిసింది. విలువ పరంగా చూసుకుంటే, ఎంఆర్ఎఫ్ ఎక్కువ ఖరీదైన దేశీ స్టాక్. దీని తర్వాత ఐషర్ మోటార్స్(రూ.24,322), బోస్ (రూ.22,988), శ్రీ సిమెంట్(రూ.16,460), పేజ్ ఇండస్ట్రీస్(రూ.14,803), 3ఎం ఇండియా(రూ.11,080) లు ఉంటాయి. ఈ దశాబ్దం ప్రారంభమైనప్పటి నుంచి ఎంఆర్ఎఫ్ షేరు ధర 4,759 శాతం పైకి ఎగిసినట్టు తెలిసింది. అంటే 50 సార్లు అన్నమాట. మార్చి 24 నాటికి ఇది రూ.59,184కు చేరుకుంది. ఎంఆర్ఎఫ్ రెవెన్యూలు, ఈబీఐడీటీఏ, ప్యాట్లు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 16, 17, 18 శాతం పైకి ఎగుస్తాయని ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ ఆనంద్ రతి ఫిబ్రవరిలోనే చెప్పారు. మార్కెట్ నిపుణుల ప్రకారం రబ్బర్ ధరలు ఫిబ్రవరి నుంచి 25 శాతం తగ్గాయని తెలిసింది. రబ్బర్ ధరలు తగ్గడం అపోలో టైర్స్, ఎంఆర్ఎఫ్ వంటి టైర్ల తయారీ సంస్థలకు అనుకూలిస్తుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. స్వల్పకాల వ్యవధిలో ఈ కంపెనీల రెవెన్యూలు, మార్జిన్లు పెరుగుతాయని అంచనావేస్తున్నారు. 2016 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు రూ.288.08 కోట్లగా నమోదయ్యాయి. ఇతర మేజర్ టైర్ల కంపెనీలు అపోలో కూడా మధ్యాహ్నం ట్రేడింగ్ లో లాభపడినట్టు తెలిసింది. -
ఒక షేరుతో.. ఓ బైక్ కొనొచ్చు!!
• ఐదంకెల ధరలోనూ షేర్ల పరుగులు • రూ.50వేలు దాటేసిన ఎంఆర్ఎఫ్ • రాబడిలోనూ టాప్ ఈ ‘ఆరు’ గుర్రాలు • అయినా కొనొచ్చంటున్న మార్కెట్ నిపుణులు సాక్షి, బిజినెస్ విభాగం : ఎంఆర్ఎఫ్ షేర్ ధర ఇటీవలే రూ.50 వేలు దాటింది. అంటే ఒక్కొక్క షేర్ ధర అక్షరాలా అర లక్ష!!. ఈ ధరతో తులంన్నర బంగారమో, ఒక మంచి బైకో, స్కూటరో కొనుక్కోవచ్చు. ఇలా పదివేలకు మించిన ఐదంకెల షేర్లు మన స్టాక్ మార్కెట్లో అరడజను దాకా ఉన్నాయి. ఇంత ధరున్నా ఈ ఏడాది ఇవి మంచి రాబడులే ఇచ్చాయి. ధర ఎక్కువైతే డిమాండ్ తగ్గుతుందన్నది సాధారణ ఆర్థిక సూత్రం. ధర అధికంగా ఉంటే లిక్విడిటీ తగ్గి, వృద్ధి లేదా లాభాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చని స్టాక్ మార్కెట్ వర్గాలు కూడా చెబుతుంటాయి. కానీ ఈ అరడజను షేర్లూ అసాధారణ వృద్ధిని సాధించాయి. ఏడాది కాలంలో స్టాక్ సూచీలు అంతంత మాత్రం వృద్ధినే సాధిస్తే, ఇవి మాత్రం 14-55 శాతం వరకూ పెరిగాయి. అసలీ షేర్లేంటి? వాటి రాబడులెంత? అధిక ధరకు కారణాలేంటి? ఇంకా కొనుగోలు చేయొచ్చా? ఈ వివరాలే ఈ కథనం... ఎందుకింత అధిక ధర ? దాదాపు ప్రమోటర్లంతా స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ షేరు ఎక్కువ ధరకు ట్రేడ్ కావాలనుకుంటుంటారు. కాబట్టి వారంతా తమ కంపెనీ షేర్ ధర సామాన్య ఇన్వెస్టర్‌కూ అందుబాటులో ఉండాలనుకుంటారు. ఇందుకోసం రేటు అధికం అనిపించినప్పుడల్లా, బోనస్ షేర్లు ఇవ్వటమో, షేర్లను విభజించటమో చేసి ధరను అందుబాటులోకి తెస్తారు. ఉదాహరణకు ఇన్ఫోసిస్‌ను తీసుకుంటే, ఇప్పటివరకూ ఎన్నోసార్లు బోనస్ షేర్లనిచ్చింది. విభజించింది. అలా చేయడం వల్ల ఈ షేర్ ముఖ విలువ రూ.1 గానూ, షేర్ ధర రూ.1,038గానూ ఉంది. ఒక వేళ ఇవేమీ లేకుంటే ఈ షేర్ రూ.2 లక్షల రేంజ్లో ఉండేది. అంత ధర ఉంటే ఇన్వెస్టర్లు ఈ షేర్ జోలికి వచ్చే వాళ్లు కాదు కదా! కొందరు ప్రమోటర్లు మరో రకంగా ఆలోచిస్తారు. షేర్ ధర అందరికీ అందుబాటులో ఉంటే, లిక్విడిటీ పెరిగి హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉంటాయని, చిన్న ఇన్వెస్టర్ల దగ్గర ఎక్కువ షేర్లుంటే, చీటికి, మాటికీ చిల్లర కారణాలకే వాటిని విక్రయిస్తారని, షేర్ ధర పడిపోతుందని వారి అభిప్రాయం. అందుకని తమ షేర్లకు బోనస్‌లు ఇవ్వరు. విభజన చేయరు. ఫలితంగా వారి షేర్ ధర అంతకంతకూ పెరిగిపోతుంటుంది. బోనస్ ఇవ్వకపోవడం, విభజించకపోవటం, తక్కువ ఈక్విటీ, తక్కువ ఫ్లోటింగ్ షేర్లు వంటి కారణాల వల్లే కొన్ని షేర్లు రూ.10వేలకు మించి ధర ఉన్నాయి. ఉదాహరణకు ఎంఆర్ఎఫ్కు మార్కెట్లో 42 లక్షల షేర్లు... రూ.4 కోట్ల ఈక్విటీ ఉండగా, ఇన్పోసిస్‌కు 228 కోట్ల షేర్లు, రూ.1,148 కోట్ల ఈక్విటీ ఉన్నాయి. మార్కెట్ క్యాపిటల్ పరంగా చూస్తే ఇన్ఫోసిస్‌ది రూ.2,38,469 కోట్లుగా ఉండగా, ఎంఆర్ఎఫ్ మార్కెట్ క్యాప్ రూ.21,892 కోట్లుగానే ఉంది. చిత్రమేంటంటే మన మార్కెట్లోని ఈ అరడజను షేర్లూ ఐదేళ్లలో అద్భుతమైన రాబడులనిచ్చాయి. ధర అధికమే... రిస్కూ అధికమే! ఇతర షేర్లతో పోల్చితే ఈక్విటీ తక్కువగా ఉన్న ఈ షేర్లలో ఒడిదుడుకులు తక్కువే ఉంటాయి. ఎందుకంటే షేర్ హోల్డింగ్ కొద్ది మందిచేతుల్లోనే ఉంటుంది. సాధారణంగా వీళ్లంతా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లై ఉంటారు కనక ఆపరేటర్లు సులభంగా ఆపరేట్ చేయలేరు. లిక్విడిటీ లేకపోవటం వల్ల షేర్ల ధరల్లో స్వల్పకాలంలో తీవ్రమైన ఒడిదుడుకుల్లాంటివి ఉండవు. షేర్ల విభజన లేకపోవడం, బోనస్ షేర్లు ఇవ్వకపోవడం వల్ల ఈక్విటీపై పరిమితి ఉంటుంది. షేర్ల సరఫరా తక్కువగా ఉంటుంది. డిమాండ్ అధికంగా ఉంటుంది కనక షేర్ ధర పెరిగే అవకాశాలుంటాయి. ధర అధికంగా ఉందనే కారణంతో ఇలాంటి షేర్లకు దూరంగా ఉండడం సరికాదన్నది నిపుణుల మాట. ధర ఎక్కువైనప్పటికీ కంపెనీ వ్యాపారం బావున్నా, భవిష్యత్ వ్యాపార అంచనాలు ఆశావహంగా ఉన్నా ఈ షేర్లను నిరభ్యంతరంగా కొనొచ్చన్నది వారి సూచన. కంపెనీ నిర్వహణ, అమ్మకాలు, నికర లాభం తదితర ఫండమెంటల్స్ క్షుణ్నంగా పరిశీలించి అవన్నీ బాగుంటే ధర అధికంగా ఉన్నా కూడా ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చన్నది వారి విశ్లేషణ. రిస్క్ అధికంగా ఉంటుంది కనక దాన్ని భరించగలిగితేనే ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమనేది వారి మాట. -
ఈ షేరు ధర రూ.50 వేలు
ముంబై: దేశీయ టైర్ల ఉత్పత్తి సంస్థ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ (ఎంఆర్ఎఫ్) షేర్ ధర బుధవారం నాటి మార్కెట్లో రికార్డ్ స్థాయిలో దూసుకుపోయింది. ముడిచమురు ధరలు క్షీణించడంతో ఇటీవల కొద్ది రోజులుగా జోరుమీదున్న టైర్ల ధరలు ఈ రోజు భారీ లాభాల బాటలో సాగాయి. ముఖ్యంగా టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్ఎఫ్ బీఎస్ఈలో 7 శాతం ఎగసి కంపెనీ చరిత్రలో మొట్టమొదటిసారిగా రూ. 50,000 స్థాయిని తాకింది. చెన్నైకు చెందిన ఈ కంపెనీ షేరు సుమారు 3వేలకు పైగా ఎగిసి మదుపర్లు ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇదే బాటలో మిగిలిన టైర్ల షేర్లుకూడా పయనించాయి. ముఖ్యంగా జేకే టైర్ 8 శాతానికి పైగా, అపోలో టైర్స్ ,సియట్ టైర్స్ 5 శాతానికి పైగా లాభపడ్డాయి. కాగా కంపెనీల ముడిసరుకు వ్యయాల్లో నేచురల్ రబ్బర్ వాటా 40 శాతం కావడమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. సహజ రబ్బర్ ధరలు నేలచూపులు చూస్తుండటంతో ఇటీవల టైర్ల తయారీ షేర్లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీనికితోడు రుతుపవన ప్రభావంతో రబ్బర్ ఉత్పత్తి పుంజుకోనుంది. ఈ సానుకూల అంశాలు టైర్ పరిశ్రమ లాభాలకు దోహదపడ్డాయని నిపుణులు పేర్కొన్నారు. -
స్టాక్స్ వ్యూ
జెట్ ఎయిర్వేస్.. కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.538 టార్గెట్ ధర: రూ.750 పుస్తక విలువ: రూ.-478 ముఖ విలువ: రూ. 10 ఈపీఎస్: రూ.93 ఏడాది కనిష్ట/గరిష్ట స్థాయి: రూ.284/రూ.783 ఎందుకంటే: జెట్ ఎయిర్వేస్ పనితీరు గత క్వార్టర్లో బలహీనంగా ఉంది. ఉద్యోగ వ్యయాలు 16 శాతం, తరుగుదల చార్జీలు 25 శాతం పెరగడం, రూ.92 కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టాలు... దీనికి ప్రధాన కారణాలు. తీవ్రమైన పోటీ కారణంగా సగటు దేశీయ రూట్లలో విమాన చార్జీలు 10 శాతం, అంతర్జాతీయ రూట్లలో విమాన చార్జీలు 3% చొప్పున తగ్గాయి. వీట న్నింటి ఫలితంగా నికర లాభం బాగా తగ్గింది. విమానయాన ఇంధనం(ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్-ఏటీఎఫ్) ధరలు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 13 శాతం పెరిగినప్పటికీ, గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోల్చితే 17% తగ్గాయి. దీంతో మార్జిన్లు 270 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఈ క్యూ1లో రూ.359 కోట్ల రుణాలను చెల్లించింది. రుణ భారం తగ్గించుకునే ప్రయత్నాల కారణంగా వడ్డీ వ్యయాలు 11% తగ్గాయి. 2011-12లో 29 శాతంగా ఉన్న ఈ కంపెనీ దేశీయ మార్కెట్ వాటా ఈ క్యూ1లో 19 శాతానికి తగ్గింది. స్పైస్‌జెట్ వంటి పోటీ కంపెనీలు కొత్త విమానాలు కొనుగోలు/లీజ్‌కు తీసుకోవడం ద్వారా విమాన సర్వీసులను పెంచడం దీనికి ప్రధాన కారణం. పోటీ కంపెనీల ఫ్లీట్ కెపాసిటి నిలకడగా ఉండడం, ఎతిహాద్ కంపెనీ నుంచి ఆరు విమానాలు అందడం వంటి కారణాల వల్ల కంపెనీ మార్కెట్ వాటా పుంజుకోవచ్చు. ప్యాసింజర్ ట్రాఫిక్ 23 శాతం వృద్ధి చెందడం, మొత్తం ఆదాయంలో 24% వాటా ఉండే ఏటీఎఫ్ ధరలు తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్జిన్లు 10% రేంజ్లో ఉండొచ్చని భావిస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, ఏటీఎఫ్ ధరలు తక్కువ స్థాయిలో ఉండడం వంటి కారణాల వల్ల రెండేళ్లలో ఆదాయం 3% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా. ఎంఆర్ఎఫ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠి ప్రస్తుత ధర: రూ.36,092 టార్గెట్ ధర: రూ.43,500 పుస్తక విలువ: రూ.16,165 ముఖ విలువ: రూ. 10 ఈపీఎస్: రూ.4,045 ఏడాది కనిష్ట/గరిష్ట స్థాయి: రూ.30,464/రూ.44,644 ఎందుకంటే: టైర్ల రంగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ వివిధ కేటగిరీ టైర్లను ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, యూరప్, పశ్చిమాసియా వంటి దాదాపు 65 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. చైనా నుంచి చౌకగా టైర్లు దిగుమతై గట్టి పోటీ ఉండటంతో ఆదాయం గత క్యూ1 స్థాయిలోనే, రూ.3,480 కోట్లుగా నమోదైంది. నికర లాభం 2 శాతం వృద్ధి చెంది రూ.490 కోట్లకు పెరిగింది. రబ్బరు ధరలు పెరగడం, సిబ్బంది, ఇతర వ్యయాలు కూడా పెరిగినప్పటికీ, నిర్వహణ పనితీరు బాగా ఉండటంతో ఇబిటా మార్జిన్ 24 శాతం పెరిగింది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ఇదే అత్యధిక స్థాయి. స్థూల మార్జిన్లు 140 బేసిస్ పాయింట్లు పెరిగాయి. రబ్బరు ధరలు పెరుగుతుండటంతో మార్జిన్లు ఒకింత తగ్గే అవకాశాలున్నాయి. అయితే ధరలు పెంచడం ద్వారా రబ్బరు ధరలు పెరిగే సమస్యను టైర్ల కంపెనీలు ముఖ్యంగా అన్ని సెగ్మెంట్లతో పాటు టైర్ల రీప్లేస్మెంట్ విభాగంలో కూడా అగ్రస్థానంలో ఉన్న ఎంఆర్ఎఫ్ సునాయాసంగా అధిగమించగలదని అంచనా. కంపెనీ నిర్వహణ పనితీరు బాగా ఉండడం కూడా కలసివచ్చే అంశమే. ఇక గ్రామీణ డిమాండ్ పుంజుకుంటుండడం, మైనింగ్ రంగ కార్యకలాపాల జోరు పెరగడం, సాగురంగ సంబంధిత టైర్లకు డిమాండ్ మెరుగుపడుతుండడం.. సానుకూలాంశాలు. రబ్బరు ధరలు పెరిగినప్పటికీ, మంచి వర్షాలు కురియడం వల్ల డిమాండ్ పుంజుకుంటుండడం మార్జిన్ల పెరుగుదలకు ఉపకరిస్తుంది. రెండేళ్లలో అమ్మకాలు 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. రబ్బరు ధరలు పెరగడం, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడంలో జాప్యం..ప్రతికూలాంశాలు. -
రూ.1,000 కోట్లతో తెలంగాణలో ఎంఆర్ఎఫ్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైర్ల తయారీలో ఉన్న ఎంఆర్ఎఫ్ (మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ) తెలంగాణలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ మొత్తాన్ని మెదక్ జిల్లా సదాశివపేట ప్లాంటు విస్తరణకు వెచ్చించనుంది. తెలంగాణలో పెట్టుబడికి ఎంఆర్ఎఫ్ సుముఖంగా ఉందని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ప్రభుత్వ పరంగా కంపెనీకి అన్ని రకాల అనుమతులను సత్వరం ఇస్తామని చెప్పారు. తెలంగాణలో కంపెనీకి మెదక్ జిల్లా సదాశివపేటతోపాటు ఇదే జిల్లాలో అంకెన్‌పల్లి వద్ద ప్లాంట్లున్నాయి. అటు ఎంఆర్ఎఫ్ పెద్ద ఎత్తున విస్తరణ బాట పట్టింది. ప్లాంట్ల విస్తరణకు వచ్చే మూడేళ్లలో రూ.4,000 కోట్లు వెచ్చిస్తామని 2014 డిసెంబర్లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కోషీ వర్గీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2010 తర్వాత కంపెనీ ఇంత పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికతో ముందుకు రావడం ఇదే మొదటిది. రూ.3,000 కోట్లతో అయిదేళ్ల క్రితం ఎంఆర్ఎఫ్ విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుచ్చి సమీపంలో ప్లాంటును స్థాపించింది. తాజాగా ఎంఆర్ఎఫ్ ఉత్తరాఖండ్‌లో బిర్లా టైర్స్‌కు చెందిన ఒక యూనిట్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు రూ.1,600 కోట్లకుపైగా వెచ్చిస్తున్నట్టు సమాచారం. ఎంఆర్ఎఫ్కు దేశవ్యాప్తంగా 10 ప్లాంట్లున్నాయి. రోజుకు 1.2 లక్షల టైర్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. సెప్టెంబర్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.14,789 కోట్ల టర్నోవర్‌పై రూ.908 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
భారత ‘పేస్’కు పదును
ఎంఆర్ఎఫ్తో బీసీసీఐ ఒప్పందం చెన్నై: భారత్‌లో పేస్ బౌలింగ్‌కు పదును పెట్టేందుకు బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టింది. పేస్ టాలెంట్‌ను వెతికిపట్టుకుని, వారికి సరైన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి బౌలర్లను తయూరు చేయూలనే లక్ష్యంతో ఎంఆర్ఎఫ్ పేస్ బౌలింగ్ ఫౌండేషన్‌తో బీసీసీఐ ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజం మెక్‌గ్రాత్ ఆధ్వర్యంలో యువ బౌలర్లు ఇక్కడ శిక్షణ పొందనున్నారు. ఈ ఒప్పందం వల్ల భవిష్యత్తులో భారత క్రికెట్‌కు మేలు జరుగుతుందని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యూదవ్ అన్నారు. ఎంఆర్ఎఫ్లో శిక్షణ కోసం సెలక్టర్లు త్వరలో 20 వుందితో ప్రాబబుల్స్‌ను ప్రకటించనున్నారు.