భారత్‌లో పేస్ బౌలింగ్‌కు పదును పెట్టేందుకు బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టింది. పేస్ టాలెంట్‌ను వెతికిపట్టుకుని, వారికి సరైన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి బౌలర్లను తయూరు చేయూలనే లక్ష్యంతో ఎంఆర్‌ఎఫ్ పేస్ బౌలింగ్ ఫౌండేషన్‌తో బీసీసీఐ ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది
ఎంఆర్‌ఎఫ్‌తో బీసీసీఐ ఒప్పందం
చెన్నై: భారత్‌లో పేస్ బౌలింగ్‌కు పదును పెట్టేందుకు బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టింది. పేస్ టాలెంట్‌ను వెతికిపట్టుకుని, వారికి సరైన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి బౌలర్లను తయూరు చేయూలనే లక్ష్యంతో ఎంఆర్‌ఎఫ్ పేస్ బౌలింగ్ ఫౌండేషన్‌తో బీసీసీఐ ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.
ఆస్ట్రేలియా దిగ్గజం మెక్‌గ్రాత్ ఆధ్వర్యంలో యువ బౌలర్లు ఇక్కడ శిక్షణ పొందనున్నారు. ఈ ఒప్పందం వల్ల భవిష్యత్తులో భారత క్రికెట్‌కు మేలు జరుగుతుందని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యూదవ్ అన్నారు. ఎంఆర్‌ఎఫ్‌లో శిక్షణ కోసం సెలక్టర్లు త్వరలో 20 వుందితో ప్రాబబుల్స్‌ను ప్రకటించనున్నారు.