హెచ్సీఏ ఎన్నికల బరిలో శ్రీధర్
- ఉపాధ్యక్ష పదవికి పోటీ
- ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్)గా వ్యవహరిస్తున్న ఎం.వి.శ్రీధర్ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆయన ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్ మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. శనివారంతో హెచ్సీఏ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తెరపడింది. మొత్తం 22 పదవులకుగాను 68 నామినేషన్లు దాఖలయ్యాయి.
మాజీ మంత్రి జి. వినోద్, అర్షద్ అయూబ్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు వేయగా, వెంకటేశ్వరన్, జాన్ మనోజ్ కార్యదర్శి పదవికి పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి వ్యవహరిస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఆయన సోమవారం ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 30 వరకు గడువుంది. వచ్చే నెల 7న ఎన్నికలు జరుగుతాయి.