సాహొరే ‘బాహుబలి’ షేర్‌ | Mrf Share rally towards rs70,000 | Sakshi
Sakshi News home page

సాహొరే ‘బాహుబలి’ షేర్‌

Published Wed, Apr 26 2017 2:42 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

సాహొరే ‘బాహుబలి’  షేర్‌

సాహొరే ‘బాహుబలి’ షేర్‌

ముంబై:బుల్‌ రన్‌లో మార్కెట్‌ లీడర్‌ ఎంఆర్‌ఆఫ్ మరోసారి బాహుబలిగా నిలిచింది. ముఖ్యంగా రికార్డ్‌ స్థాయి లాభాలతో దూసుకుపోతున్న మార్కెట్లలో   మరోసారి టైర్‌ స్టాక్స్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. మదుపర్ల కొనుగోళ్లతో టైర్‌ సెక్టార్‌ ఆకర్షణీయంగా ఉంది. దీంతో  ఇటీవల భారీ లాభాలతో రికార్డ్‌ ధరను నమోదు చేసిన బాహుబలి షేర్‌ ఎంఆర్‌ఎఫ్‌ 5 శాతం జంప్‌చేసి ఒక దశలో రూ. 69,848 వద్ద  ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది.  అంతేకాదు ఎంఆర్‌ఆఫ్‌  రూ.70వేల మార్క్‌ను  అధిగమించే అవకాశం ఉందని  నిపుణులు  పేర్కొన్నారు.  అంతర్జాతీయ రబ్బరు ధరలు క్షీణత, డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో  రబ్బర్‌ షేర్లపై  బుల్లిష్‌ ట్రెండ్‌ను అంచనా వేస్తున్నారు.
 
టీవీఎస్‌ శ్రీచక్ర 7 శాతం ఎగసి రూ. 4169కు, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 6 శాతం దూసుకెళ్లి రూ. 1554కు చేరగా.. సియట్ దాదాపు 4 శాతం ఎగసి రూ. 1519ను తాకింది. ఇక జేకే టైర్స్‌ 2.4 శాతం పెరిగి రూ. 163కు చేరగా, అపోలో టైర్స్‌ 2.2  శాతం బలపడి రూ. 248 వద్ద ట్రేడవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement