towards
-
అడవిలో అమ్మప్రేమ!
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలుఅందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.– ఆత్మకూరు రూరల్పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపిపిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.అంతా.. ఏకాంతం..ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్‌బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.నీ ప్రేమ భల్లూకం గాను..వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి. గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి. -
గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ మున్ముందుకే
ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న ఇండియా ఇక ముందు ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ వాహనాల రంగంలో కూడా ముందుకు సాగే అవసరంతోపాటు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెట్రోలు, డీసెల్ బదులు విద్యుత్ బ్యాటరీలతో నడిచే వాహనాల వినియోగాన్ని నేటి ప్రపంచంలో ‘గ్రీన్ మొబిలిటీ’ అని పిలుస్తున్నారు. గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ సైతం ప్రగతి సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన కృషి చేస్తోంది. ప్రపంచంలో ఆటోమొబైల్ రంగంలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది మూడో ర్యాంకర్ జపాన్ను ఆటో అమ్మకాల్లో ఇండియా అధిగమించింది. కిందటేడాది జపాన్ 42 లక్షల ఆటోమొబైల్ వాహనాలను అమ్మగా, ఇండియాలో 42 లక్షల 50 వేల వాహనాలు అమ్ముడయ్యాయి. వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలో ఎలెక్ట్రిక్ కార్లు, ఇతర రకాల వాహనాల ఉత్పత్తి పెరిగితే ఆటో రంగంలో చైనా, అమెరికాలను ఇండియా దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. అమెరికాలోని అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోని పెద్ద రాష్ట్రం జార్జియా గ్రీన్ మొబిలిటీలో అగ్రభాగాన నిలిచే దిశగా ముందుకు సాగుతోంది. ఈ రాష్ట్రాన్ని అమెరికాకు ‘ఎలెక్ట్రిక్ మొబిలిటీ రాజధాని’గా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఆటోమొబైల్ రంగంలో అమెరికాలో మొదటి స్థానంలో ఉన్న మిషిగన్ రాష్ట్రాన్ని మించిపోతుందని అంచనా. గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ నాలుగేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ, వాటికి అవసరమైన బ్యాటరీలు, చార్జింగ్ పరికరాలు ఉత్పత్తి విస్తరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని సర్కారు ఏటా ప్రోత్సాహకాలు ప్రకటాస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఎలెక్ట్రిక్ (గ్రీన్) మొబిలిటీకి తగిన వ్యవస్థ, వాతావరణం ఏర్పాటు చేయడానికి గతంలోనే ఈ రంగంలో అనుభవం ఉన్న ‘ఊర్జా గ్లోబల్’ అనే కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) ఒప్పందం చేసుకుంది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లిథియం-అయాన్ బ్యాటరీలు, ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు ఏపీలో ఏర్పాటవుతాయి. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఊర్జా గ్లోబల్ రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమల వల్ల 250 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలుంటాయని అప్పుడు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ ను ఎలెక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ కేంద్రంగా చేయడానికి వరల్డ్ ఇకనామిక్ ఫోరమ్ తో కలిసి ఏపీ సర్కారు కిందటేడాది ఆగస్టులో ఏర్పాటు చేసిన తొలి వర్చ్యుల్ మీటింగ్ విజయవంతంగా జరిగింది. విద్యుత్ వాహనాల రంగంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని ఈ సమావేశంలో ప్రసంగించిన నీతి ఆయోగ్ సలహాదారు సుధేందు సిన్హా విశ్వాసం ప్రకటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న సాంప్రదేయేతర ఇంథన వనరుల ఉత్పత్తి కారణంగా ఎలెక్ట్రిక్ వాహనాల రంగం విస్తరణకు అనువైన వాతావరణం ఉందని అందరూ గుర్తిస్తున్నారు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
రికార్డు దిశగా బంగారం ధర.. ఇవీ కారణాలు..
సాక్షి, విశాఖపట్నం: పసిడి ధర పరుగులు తీస్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. కొన్నాళ్లుగా ధర పెరగడమే తప్ప తగ్గడంలేదు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నెలన్నర క్రితం డిసెంబర్ 5న 24 కేరెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉంది. ప్రస్తుతం రూ.58,770కు చేరింది. అంటే 45 రోజుల్లో రూ.మూడున్నర వేలు పెరిగింది. ఇక 22 కేరెట్ల పుత్తడి రూ.54,040కి చేరుకుంది. నగల దుకాణాల్లో ఆభరణాలపై తరుగు, మజూరీ పేరిట 10 నుంచి 23 శాతం వరకు కొనుగోలుదారుడి నుంచి అదనంగా వసూలు చేస్తారు. ఈ లెక్కన సగటున 15 శాతం వీటికి చెల్లిస్తే పది గ్రాముల బంగారు నగకు రూ.68 వేలు అవుతోంది. దీనికి జీఎస్టీ అదనం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బంగారాన్ని తులం (11.66 గ్రాములు) లెక్కల్లో కొనుగోలు చేస్తారు. ఆ లెక్కన చూస్తే తులం ముడి బంగారం ధర రూ.68,625 అవుతుంది. అదే తులం ఆభరణాల ధర రూ.79 వేల వరకు ఉంటుంది. బంగారాన్ని ఆభరణాలకే కాకుండా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలోనూ వినియోగిస్తారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కూడా ఊపందుకుంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఆరి్థక మాంద్యం కూడా తోడైంది. అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావం, షేర్ మార్కెట్లో అనిశ్చితి వంటివి పసిడి ధర ఎగబాకడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆల్‌టైం హై దిశగా.. 2020 ఆగస్టులో 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,300కు చేరుకుంది. పుత్తడి చరిత్రలో అదే ఆల్‌టైం రికార్డు. ఇప్పుడు మళ్లీ ఆ రికార్డును దాటుకొని సరికొత్త రికార్డు దిశగా బంగారం పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ధర పెరుగుతున్న వేగం, అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వర్తకులు అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న కొనుగోళ్లు బంగారం ధర పెరుగుదల ఆభరణాల కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. కొన్నాళ్లుగా పసిడి ధర పెరుగుతుండడం వల్ల అమ్మకాలు పడిపోయాయని ది బెజవాడ జ్యూయలరీ అండ్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.శ్రీహరి సత్యనారాయణ ‘సాక్షి’తో చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (30 గ్రాములు) ధర 1910 నుంచి 1931 డాలర్లకు పెరిగిందన్నారు. చదవండి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో సగం సీట్లు ఖాళీ ఇది 1870 డాలర్లకు దిగివస్తే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్థిక మాంద్యం, డాలరుతో రూపాయి మారకం విలువ తగ్గడం వంటివి బంగారం ధర పెరగడానికి దోహదపడుతున్నాయని విశాఖ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మారోజు శ్రీనివాసరావు చెప్పారు. పెళ్లిళ్ల సీజను వేళ పెను భారం.. ఈనెల 25 తర్వాత నుంచి పెళ్లిళ్ల సీజను ప్రారంభమవుతుంది. పెళ్లింట బంగారం కొనుగోలు తప్పనిసరి. పేద, మధ్య తరగతి వారు కనీసం 40 – 50 గ్రాములైనా కొనాలి. ఈ స్వల్ప మొత్తానికే రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాలి. ఇలా ఆకాశాన్నంటుతున్న పసిడి ధర తమకు పెనుభారం అవుతుందని మధ్య తరగతి వారు చెబుతున్నారు. -
సాహొరే ‘బాహుబలి’ షేర్
ముంబై:బుల్ రన్లో మార్కెట్ లీడర్ ఎంఆర్‌ఆఫ్ మరోసారి బాహుబలిగా నిలిచింది. ముఖ్యంగా రికార్డ్ స్థాయి లాభాలతో దూసుకుపోతున్న మార్కెట్లలో మరోసారి టైర్ స్టాక్స్‌కు డిమాండ్ కనిపిస్తోంది. మదుపర్ల కొనుగోళ్లతో టైర్ సెక్టార్ ఆకర్షణీయంగా ఉంది. దీంతో ఇటీవల భారీ లాభాలతో రికార్డ్ ధరను నమోదు చేసిన బాహుబలి షేర్ ఎంఆర్ఎఫ్ 5 శాతం జంప్‌చేసి ఒక దశలో రూ. 69,848 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది. అంతేకాదు ఎంఆర్‌ఆఫ్ రూ.70వేల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అంతర్జాతీయ రబ్బరు ధరలు క్షీణత, డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రబ్బర్ షేర్లపై బుల్లిష్ ట్రెండ్‌ను అంచనా వేస్తున్నారు. టీవీఎస్ శ్రీచక్ర 7 శాతం ఎగసి రూ. 4169కు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6 శాతం దూసుకెళ్లి రూ. 1554కు చేరగా.. సియట్ దాదాపు 4 శాతం ఎగసి రూ. 1519ను తాకింది. ఇక జేకే టైర్స్ 2.4 శాతం పెరిగి రూ. 163కు చేరగా, అపోలో టైర్స్ 2.2 శాతం బలపడి రూ. 248 వద్ద ట్రేడవుతోంది. -
రికార్డు కనిష్టానికి చేరువగా రుపీ
ముంబై: విశ్లేషకులు అంచనా వేసినట్టుగా రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మరింత క్షీణించింది. ఇవాల్టి ట్రేడింగ్ ప్రారంభంలోనే బలహీనపడిన రూపాయి 28పైసలు క్షీణించి రూ.68.44 వద్ద మరింత బలహీన సంకేతాలను అందిస్తోంది. రికార్డు స్థాయి కనిష్టంతో 2013 ఆగస్టు నాటి 68. 85 స్తాయి వైపుగా కదులుతోంది. దీనికితోడు నవంబరు 8 డిమానిటేజేషన్ ప్రకటన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు 12 వేల కోట్ల పెట్టబడులను దేశీయ మార్కెట్లనుంచి ఉపసంహరించుకోవడం దేశీయ కరెన్సీని బలహీపరుస్తోంది. అయితే ప్రారంభంలోనే 11 పైసలు నష్టోయిన రూపాయి 8 నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. డాలర్ పుంజుకోవడం, భారీగా పుంజుకున్న అమెరికా మార్కెట్లు, డిమానిటైజేషన్ రూపాయి విలువ పతనానికి కారణంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.మరోవైపు డెరివెటివ్ ముగింపు నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్నాయి. కాగా డిసెంబర్లో ఫెడ్ పెరగనున్నాయనే అంచనాలకు తోడు యూఎస్ హోమ్ సేల్స్ డేటా భారీగా నమోదు కావడంతో ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే డాలర్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. -
లక్ష్యం దిశగా ‘హరితహారం’
► ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ ముందంజ ► రంగారెడ్డి, హైదరాబాద్‌లో నత్తనడక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది. రెండో విడత హరితహారం ప్రారంభమై నెలరోజులైంది. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో సగం పూర్తయింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. నర్సరీల్లో ప్రజల డిమాండ్‌కు అనువైన పండ్ల మొక్కలు లేకపోవడం, ప్రభుత్వ యంత్రాం గం కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్ల కొద్దిరోజులుగా మొక్కలు నాటే కార్యక్రమం ఆశించినస్థాయిలో సాగడంలేద ని అధికారులు అంటున్నారు. మూడేళ్లలో రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం అడవులు, చెట్లు ఉండాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్ష. అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరుకు కూడా హరితహారాన్నే గీటురాయిగా తీసుకుంటున్నట్లు తరచూ అధికారుల సమావేశాల్లో సీఎం స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 8న సీఎం హరితహారంపై సమీక్షించి వర్షాకాలంలోనే కాకుండా అన్ని కాలాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. గ్రేటర్లో నత్తనడక హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో హరితహారం నత్తనడకన సాగుతోంది. హైదరాబాద్‌లో ఖాళీ స్థలాలు లేక కార్యక్రమం ఆశించినస్థాయిలో సాగడం లేదు. రంగారెడ్డి జిల్లాలో మొక్కలు పెంచేందుకు అనువుగా వందల ఎకరాల ఖాళీస్థలాలు, అనుకూలమైన వాతావరణమున్నా అధికారయంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనే మూడేసి కోట్లకుపైగా మొక్కలు నాటినట్లు ప్రభుత్వలెక్కలు చెబుతున్నాయి. ఈ జిల్లాలు మాత్రమే వరుసగా మొదటి, రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి. -
నింగికెగసిన పప్పుల ధరలు