న్యూఢిల్లీ: టైర్ల కంపెనీ ఎమ్‌ఆర్‌ఎఫ్ గత ఆర్థిక సంవత్సరం జనవరి– మార్చి క్వార్టర్‌లో రూ.345 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో వచ్చిన రూ.287 కోట్ల నికర లాభంతో పోలిస్తే 20 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలియజేసింది.
మొత్తం ఆదాయం రూ.3,778 కోట్ల నుంచి రూ.3,945 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.54 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,486 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 24 శాతం క్షీణించి రూ.1,132 కోట్లకు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment