న్యూఢిల్లీ: టైర్ల కంపెనీ ఎమ్‌ఆర్‌ఎఫ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 12 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.263 కోట్లకు తగ్గిందని ఎమ్‌ఆర్‌ఎఫ్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.3,660 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.4,005 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది. మూరత్ ట్రేడింగ్‌లో భాగంగా బుధవారం నాడు బీఎస్‌ఈలో ఎమ్‌ఆర్‌ఎఫ్ షేర్ 0.7 శాతం లాభంతో రూ.65,485 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment