‘మార్కెట్ బాహుబలి’ ఎంఆర్‌ఆఫ్ జోరు
ముంబై: మార్కెట్ ఎనలిస్టులు అంచనాలను అధిగమించి మార్కెట్ బాహుబలి ఎంఆర్ ఆఫ్ మరో కీలక రికార్డ్ స్థాయిని తాకింది. లాభాల స్వీరణతో మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో పయనిస్తుండగా మరోసారి టైర్ స్టాక్స్ ర్యాలీ మాత్రం ఈరోజుకూడా కొనసాగుతోంది. ముఖ్యంగా మార్కెట్ లీడర్ ఎంఆర్‌ఎఫ్ ఎంఆర్‌ఆఫ్ నిన్నటి హవాను కొనసాగిస్తోంది. రూ. 70,164.60 వద్ద రికార్డ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇంట్రాడేలో గరిష్టాన్ని తాకిన ఈ షేర్ మార్కెట్ లో ’బాహుబలి’ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతంఈ గరిష్టాని స్వల్పంగా వెనక్కి తగ్గి 1.36శాతంలాభంతో 69, 784 వద్ద కొనసాగుతోంది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 30,000 కోట్లను తాకడం విశేషం.
ఇదే బాటలో సియట్ జేకే టైర్స్ అపోలో టైర్స్ పయనిస్తున్నాయి. మరోవైపు ఎఫ్ అండ్ వో సిరీస్ ముగింపు నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది.నిన్న రికార్డ్ ఆల్ టైం హైని టచ్ చేయడంతో మదుపర్లు అమ్మకాలకు దిగి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.