సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభంనుంచీ లాభాల్లో కొనసాగిన సూచీలు చివరి వరకు అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. ప్రధానంగా రియల్టీషేర్లు లాభాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి.
418 పాయింట్లు లాభంతో 63,143వద్ద 119 పాయింట్ల లాభంతో నిఫ్టీ 18,720 వద్ద ముగిసాయి. దాదాపు టాటా కన్జ్యూమర్స్, టైటన్, సిప్లా, ఏసియన్ పెయింట్స్ భారీగా లాభపడగా, కోటక్ మ హీంద్ర, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?)
ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో రూపాయి 8 పైసలు పెరిగింది. ఏప్రిల్ 2023లో 4.7శాతంగా సీపీఐ ద్రవ్యోల్బణం మే 2023లో 4.25శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.
విశేషం ఏమిటంటే , ఎంఆర్‌ఆఫ్ రికార్డ్
ప్రఖ్యాత రబ్బరు టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ మరోసారి ఆకాశానికి దూసుకుపోయింది. ఎంఆర్‌ఎఫ్ షేరు తొలిసారి లక్ష మార్క్‌ను టచ్ చేసింది. అంతేకాదు రానున్న కాలంలో షేర్ ధర రూ.1.47 లక్షల మార్కును చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్‌గా నిలిచింది.
ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, మార్కెట్ అప్‌డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment