న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో 4 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.301 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.312 కోట్లకు పెరిగిందని టైటాన్ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,595 కోట్ల నుంచి రూ.4,693 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ సి.కె. వెంకటరామన్ పేర్కొన్నారు. డిమాండ్, వినియోగదారుల సెంటిమెంట్స్ అంతంతమాత్రంగానే ఉన్నా, తమ అన్ని వ్యాపార విభాగాలు మంచి వృద్ధిని సాధించాయని వివరించారు.
ఇతర కంపెనీలతో పోలి్చతే జ్యూయలరీ వ్యాపారం వృద్ధినే సాధించిందని పేర్కొన్నారు. వాచ్‌లు, కళ్లజోళ్ల వ్యాపారాలు మాత్రం మంచి వృద్ధిని సాధించాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో డిమాండ్ పుంజుకునేలా వివిధ బ్రాండ్లలో కొత్త కొత్త కలెక్షన్‌లను అందించనున్నామని, తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్‌ఈలో టైటాన్ కంపెనీ షేర్ 1.2 శాతం తగ్గి రూ.1,284 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment