కరోనా వైరస్ పై పోరుకు చాలామంది తమవంతు సాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. బీడీ కార్మికుల నుంచి బడా బడా కంపెనీల వరకు ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. తాజాగా డాబర్ గ్రూప్ కూడా ముందుకొచ్చింది. కరోనా వైరస్ సహాయక చర్యల కోసం రూ. 21 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ‘డాబర్ కేర్ ఫండ్ ఫర్ కోవిడ్ 19’ ద్వారా రూ. 11కోట్ల రూపాయలను ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు అందించనుంది. కాగా మిగతా మొత్తాన్ని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, వలస కార్మికుల కోసం అందించనున్నట్లు ప్రకటించింది. ‘ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదాం. ప్రజల ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం.. ఆ దిశగా డాబర్ గ్రూప్ పనిచేస్తుందని' డాబర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అమిత్ బర్మానీ చెప్పారు. (తెలంగాణలో 487 కరోనా పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment