
సాక్షి,ముంబై: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా క్యూ2 నికర లాభాల్లోవృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో నికర లాభంలో 5.46 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 268.72 కోట్ల నుంచి రూ .283.41 కోట్లకు పెరిగింది. క్యూ 2 లో మొత్తం ఆదాయం 3.96 శాతం పెరిగి రూ.1,492.62 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఇది రూ. 1,435.75 కోట్లను ఆర్జించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో దేశీయ వినియోగదారుల వృద్ధిలో బలమైన వృద్ధిని సాధించినట్టు కంపెనీ ప్రకటించింది. అయితే, ఈజిప్టు, టర్కీ, నైజీరియాలో కరెన్సీ బాగా విలువ తగ్గడం, కీ భౌగోళిక పరిస్థితుల్లో కొనసాగుతున్న అవాంతరాల కారణంగా విదేశీ వ్యాపారం దెబ్బతిందని ఒక ప్రకటనలో తెలిపింది.
ఏకీకృత ఆధారంగా, 2017-18 క్వార్టర్లో కంపెనీ నికర లాభం 1.20 శాతం పెరిగి రూ .362.67 కోట్లకు చేరింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 1.33 శాతం క్షీణించి రూ .2,043.25 కోట్లకు చేరుకుంది. దేశీయ వినియోగదారుల డిమాండ్ రాబోయే నెలల్లో మరింత పెరిగిపోతుందని విశ్వసిస్తున్నామని డాబర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ దుగ్గల్ చెప్పారు. 2017-18 నాటికి డైరెక్టర్ల బోర్డు 125 శాతం డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. ప్రతీ షేరుకు రూ.1.25 మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్టు డాబర్ ఇండియా చైర్మన్ ఆనంద్ బర్మన్ చెప్పారు. దీంతో డాబర్ ఇండియా షేరు లాభాల్లో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment