మ్యాగీ నూడుల్స్ ఎగుమతులకు కోర్టు అంగీకారం
ముంబై: సంచలనం రేపిన మ్యాగీ ఉత్పత్తుల నిషేధం కేసులో నెస్లే సంస్థకు కాస్తలో కాస్త ఊరట లభించింది. ఇప్పటికే భారత్లో నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలన్న నెస్లే అభ్యర్థనకు బాంబే హైకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తీర్పును వెలువరించింది.
మ్యాగీ నూడుల్స్ లో సీసం(లెడ్), మోనో సోడియం గ్లూటామేట్(ఎంఎస్‌జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి మించి ఉన్నాయనిని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తనిఖీల్లో రుజువుకావడంతో ఆ ఉత్పత్తులపై జూన్ 5న కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో మ్యాగీ ఉత్పత్తులన్నింటినీ ధ్వసం చేయాలనే డిమాండ్ వెల్లువెత్తడంతో అలా చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలని నెస్లే సంస్థ కోర్టును ఆశ్రయించింది.