2023లోనూ ఆహార ద్రవ్యోల్బణం | India is among fastest growing markets for Nestle | Sakshi
Sakshi News home page

2023లోనూ ఆహార ద్రవ్యోల్బణం

Mar 25 2023 5:24 AM | Updated on Mar 25 2023 12:11 PM

India is among fastest growing markets for Nestle - Sakshi

న్యూఢిల్లీ: ఆహార ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా పలు ప్రాంతాల్లో మాంద్యం ఘంటికలు 2023లోనూ కొనసాగుతాయని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్‌ నారాయణన్‌ అంచనా వేశారు. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు నెస్లే ఇండియా పలు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. వాటాదారులకు పంపిన తాజా వార్షిక నివేదికలో నారాయణన్‌ ఈ అంశాలను ప్రస్తావించారు.

(ఇదీ చదవండి: జియో కస్టమర్లకు ట్విస్ట్: ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్‌ ఇక రూ. 299లు)

అటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆశాజనకంగా ఉండడం కంటే, బోరింగ్‌గా స్థిరత్వంతో కొనసాగం మెరుగైన విధానంగా పేర్కొన్నారు. కంపెనీ అమ్మకాల పరిమాణంపై దృష్టి పెట్టిందని, ‘రూర్బాన్‌’ వ్యూహం కింద చిన్న పట్టణాలు, గ్రామాలకూ విస్తరిస్తున్నట్టు చెప్పారు. ఆవిష్కరణలనూ చేపడుతున్నట్టు తెలిపారు. అదే సమయంలో ప్రీమియం ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డిమాండ్‌ ఉంటున్నట్టు వివరించారు. నెస్లేకి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్‌ కూడా ఒకటని నారాయణన్‌ తెలిపారు.   (ట్విటర్‌ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు)

2022లో ఎన్నో సవాళ్లు..
2022ను అసాధారణ సంవత్సరంగా పేర్కొన్నారు. సంవత్సరం ఆరంభంలో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్, వాతావరణ సమస్యలు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం పరిమాణాలను ప్రస్తావించారు. ఎఫ్‌ఎంసీజీ రంగానికి గతేడాది సమస్యాత్మకంగా ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు, ఇంధన ధరల పెరుగుదల, పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంత ప్రజలపై ద్రవ్యోల్బణం ప్రభావం అధికంగా ఉన్నట్టు వివరించారు. (హిండెన్‌బర్గ్‌ లేటెస్ట్‌ రిపోర్ట్‌: భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ అమృత ఆహూజా పాత్ర ఏంటి?)

ఈ సమస్యలను అధిగమించే సామర్థ్యాలు భారత్‌కు ఉండడం, ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యం పాటించడాన్ని అంతర్జాతీయంగా గుర్తింపునకు నోచుకున్నట్టు నారాయణన్‌ చెప్పారు. బలమైన కార్యాచరణ అమల్లో పెట్టామని, నిరంతరం పర్యవేక్షణతోపాటు అసాధారణ సవాళ్లను గుర్తించడం, పరిష్కరించడం ఇందులో భాగమని వివరించారు. నెస్లే ఉత్పత్తుల లేబుళ్లపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని, ఇతర సమాచార వ్యాప్తి ద్వారా కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు పనిచేస్తున్నట్టు వాటాదారులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement