నెస్లే ఇండియా చీఫ్‌గా 16 ఏళ్ల తర్వాత భారతీయుడు
న్యూఢిల్లీ : మ్యాగీ ఉదంతంతో స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లే కంపెనీ తన ఇండియా విభాగపు అధిపతిని తొలగించింది. ప్రస్తుతం నెస్లే ఇండియా మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న ఇటిన్నె బెనెట్‌ను తొలగించి సురేశ్ నారాయణన్ నియమించింది. ఈ నియామకం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడిని ఈ ఉన్నత పదవిలో నెస్లే నియమించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిషేధం కారణంగా మ్యాగీ నూడుల్స్‌ను నెస్లే కంపెనీ స్టోర్స్ నుంచి ఉపసంహరించింది. 1999లో నెస్లేలో చేరిన నారాయణన్ ప్రస్తుతం నెస్లే ఫిలిప్పైన్స్ చైర్మన్, సీఈఓగా పనిచేస్తున్నారు.