విడుదలైన నిమిషాల్లోనే.. | 0 Limited Edition Polestar Engineered Volvo S60 Sold Out In 39 Minutes | Sakshi
Sakshi News home page

విడుదలైన నిమిషాల్లోనే..

Published Sat, Jun 30 2018 4:23 PM | Last Updated on Sat, Jun 30 2018 7:09 PM

0 Limited Edition Polestar Engineered Volvo S60 Sold Out In 39 Minutes  - Sakshi

లిమిటెడ్‌ ఎడిషన్‌గా లాంచ్‌ అయిన వోల్వో సరికొత్త సెడాన్‌ కారు నిమిషాల్లో హాట్‌ కేకుల్లా అమ్ముడు పోయింది. ఈ కార్ల బుకింగ్‌ ప్రారంభమైన 39 నిమిషాల్లోనే మొత్తం యూనిట్లు అమ్ముడయ్యాయట. లిమిటెడ్‌గా తీసుకొచ్చిన మొత్తం 20 యూనిట్లు ప్రీ బుకింగ్‌లో బుక్‌ అయ్యాయనీ, అమెరికాలో ఈ రికార్డు విక్రయాలు నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. దీని ధర రూ. 45.04 లక్షలు(ఆన్ రోడ్, న్యూఢిల్లీ) .

స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ ఉత్పత్తుల సంస్థ వోల్వో ఇటీవల ఎస్‌60 మోడల్‌లో ప్రత్యేక ఎడిషన్‌ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే . అయితే అమెరికా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ కారు ను వోల్వో యాప్‌ ద్వారా శుక్రవారం విక్రయాలను ప్రారంభించారు. కారు ధర, లిమిటెడ్‌ ఎడిషన్‌ను ప్రకటించిన తర్వాత 39 నిమిషాల్లోనే కార్లన్నీ బుక్‌ అయిపోయాయని వోల్వో తెలిపింది. 2019లో ఈ కారును కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది. పోలెస్టార్ ఇంజనీర్డ్ వెర్షన్ ఎస్‌ 60 సెడాన్ వోల్వో యాప్‌ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపింది. 415బీహెచ్‌ పవర్‌, 669ఎన్‌ఎం టార్క్, ఓహిలిన్స్‌ సస్పెన్షన్, బ్రెంబో బ్రేక్స్‌, తదితర అధునాతన ఫీచర్స్‌ ఈ సెడాన్‌ సొంతం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement