MP Husband Sold His Wife To Clear Debt From Borrowed Persons - Sakshi
Sakshi News home page

అప్పు తీర్చలేక.. భార్యను అమ్మేశాడు

Published Mon, Jul 12 2021 8:04 PM | Last Updated on Tue, Jul 13 2021 11:12 AM

Madhya Pradesh: Husband Sold His Wife For Clear Debt To Borrow Persons - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: భర్త అంటే జీవితాంతం తోడుగా ఉండే వాడంటారు. కానీ దీనికి భిన్నంగా ఓ భర్తే తన భార్యను అంగట్లో వస్తువులా భావించి అమ్మేసాడు. అందుకు నిరాకరించడంతో ఆమెను చంపాలని చూశాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. గున ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో  అతను తన అవసరాల నిమిత్తం ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు.

అప్పు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిళ్లు రావడం, ఇప్పట్లో అప్పు తీర్చే దారి లేక ఆ వ్యక్తి ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. ఈ క్రమంలో తన భార్యను లక్ష రుపాయలకు అమ్ముతున్నట్లు వాళ్లకే బేరం కుదుర్చుకున్నాడు. ఇక ఈ విషయాన్ని చెప్పడానికి పొలంలో పనిచేసుకుంటున్న తన భార్య దగ్గరికి వాళ్లని తీసుకెళ్లాడు. తన భార్యతో.. నిన్ను అమ్మేశానని, వాళ్లతో వెళ్లిపొవాల్సిందిగా చెప్పాడు. ఒక్కసారిగా భర్త నోటి నుంచి ఊహించని మాట వినేసరికి ఆమె షాక్ లో ఉండిపోయింది. కాగా ఇందుకు ఆమె నిరాకరిస్తూ... భర్తతో గొడవపడింది. దీంతో ఆ రాత్రి కోపంతో ఆ వ్యక్తి నిద్రపోతున్న తన భార్యను తీసుకెళ్లి బావిలో పడేశారు. ప్రాణాలతో బయటపడ్డ మహిళ తండ్రితో కలిసి పోలీసులకు ఆమె భర్త, అత్తపై ఫిర్యాదు చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement