
భార్య భర్తల మధ్య అలకలు, గొడవలు సాధారణ విషయం. ఎప్పుడు గొడవపడినా కొంత సమయానికి దానిని మరిచిపోయి మళ్లీ నార్మల్ అయిపోయేవారు కొందరైతే, చిన్న చిన్న గొడవలకే ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు. తాజాగా చిన్నగా గొడవపడి నిద్రపోతున్న భార్య వేళ్లను గొడ్డలితో నరికిన భర్త బాగోతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలోని బేతుల్ జిల్లా చిచోలి గ్రామానికి చెందిన రాజు వన్ష్కర్‌కు అతని భార్యతో కుటుంబ సమస్యలపై తరచూ గొడవలు ఏర్పడేవి.
ఈ క్రమంలో ఓ రోజు వీరిద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయికి వెళ్లడంతో.. భార్యపై కోపంతో రగిలిపోయిన రాజు గురువారం(మార్చి25) తెల్లవారుజామున భార్య నిద్రపోతుండగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. గొడ్డలితో భార్య చేతి బొటనవేలు, మరో చేతి మూడు వేళ్లను కిరాతకంగా నరికాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళను బోపాల్ నగరంలోని హమీదియా ఆసుపత్రికి తరలించారు. భార్య వేళ్లు నరికిన భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరో ఘటనలో ఓ వ్యక్తి తన భార్య క్యారెక్టర్‌పై అనుమానం వచ్చి తన చేతులను నరికి ఆమెను అడవిలో పడేశాడు. ఈ దారుణ ఘటన ఈనెల 22న మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగింది. అనంతరం బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆమె చేతులను తిరిగి కుట్టేందుకు 9 గంటల సమయం పట్టింది. కాగా రాష్ట్రంలో వరుస దారుణ ఘటనలు చోటుచేసుకుండటంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘోరమైన నేరాలను నివారించేందుకు నిందితులను కఠినంగా శిక్షించేలా కొత్త చట్టాలు రూపొందిస్తామని సీఎం పేర్కొన్నారు.
చదవండి:
ప్రేమ వివాహం.. భార్యను దారుణంగా కొట్టి
మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్..
Comments
Please login to add a commentAdd a comment