దేశంలో ఫుట్‌బాల్‌ను పిచ్చిగా ప్రేమించేవారిలో బెంగాలీలు ముందుం టారు.
కోల్‌కతా: దేశంలో ఫుట్‌బాల్‌ను పిచ్చిగా ప్రేమించేవారిలో బెంగాలీలు ముందుం టారు. క్రికెట్ క్రేజ్ ఉన్న సమయంలో కూడా కోల్‌కతాలో ఫుట్‌బాల్ వినోదానికి కొదవుండదు. అది అండర్–17 స్థాయిదే అయి నా ఆటపై వారి అభిమానంలో తేడా ఉండదు.
మన దేశంలో అక్టోబర్‌లో నిర్వహించే అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు టికెట్లు ఇలా ఆన్‌లైన్లో పెట్టారో లేదో.. అలా 12 గంటలు గడిచేలోపు ‘సోల్డ్ అవుట్’ బోర్డ్‌లు వేలాడుతున్నాయి. కోల్‌కతాలో జరిగే 10 మ్యాచ్‌లకు (ఫైనల్‌తో కలిపి) టికెట్లను అందుబాటులో ఉంచగా, వాటన్నిం టినీ ఒక్కపూటలోనే కొనేయడం విశేషం.