ఐఫోన్7 అప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్
ఐఫోన్7 అప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్
Published Fri, Sep 16 2016 2:06 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
మెరిసే గాడ్జెట్లపై ఎక్కువగా ఆసక్తిచూపే స్మార్ట్ఫోన్ ప్రియుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్ ఐఫోన్7 స్టాక్ అప్పుడే అయిపోయిందట. ఐఫోన్ 7 ప్లస్, అన్నీ జెట్ బ్లాక్ ఐఫోన్7 ఫోన్లు ఇప్పటికే అమ్ముడుపోయినట్టు యాపిల్ వెల్లడించింది. ముందస్తు రిజిస్ట్రేషన్లతో ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయినట్టు ప్రకటించిన యాపిల్, ఈ ఫోన్ కొనుకుందామని ఆశగా శుక్రవారం స్టోర్కు విచ్చేసే వినియోగదారులకు ఇవి పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. రిజర్వేషన్ లేకుండా వచ్చే కస్టమర్లకు సప్లై చేయలేకవచ్చని వెల్లడించింది. పరిమిత పరిమాణంలో మాత్రమే ఈ సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ రంగుల్లో ఐఫోన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. శుక్రవారం నుంచి అన్ని రిటైల్ దుకాణాల్లో ఈ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లతోనే అన్ని అమ్ముడుపోవడంతో, పరిమితంగా మాత్రమే ఈ ఫోన్లు వినియోగదారులకు లభించనున్నాయి.
యాపిల్ జెట్ బ్లాక్ ఐఫోన్స్, ఐఫోన్7 ప్లస్ మోడల్స్ అన్నీ ముందస్తు ఆన్లైన్ ఆర్డర్తో పూర్తిగా అమ్మేసినట్టు, ప్రస్తుతం ఎలాంటి ఇన్వెంటరీ లేదని తెలిపింది. ఒకవేళ జెట్ బ్లాక్ రంగులో ఐఫోన్ కావాలనుకుంటే, ఆన్లైన్లో ఆర్డరు చేసి, కొన్ని రోజులు వేచిచూడాల్సి ఉందని యాపిల్ పేర్కొంది. స్టోర్లలో ఈ ఫోన్లను పొందలేరని వెల్లడించింది. అన్ని రంగుల అన్ని మోడల్స్ ఐఫోన్లు యాపిల్.కామ్లోనే ఆర్డరు చేయాల్సి ఉంటుందని కూడా తెలిపింది. కస్టమర్ల సహనాన్ని తాము అభినందిస్తున్నామని, త్వరలోనే ఈ ఫోన్లను వినియోగదారుల చేతులోకి తీసుకొస్తామని యాపిల్ వివరించింది. అంచనాలకు మించి డిమాండ్ వెల్లువెత్తుండడంతో, కంపెనీ స్టాక్స్ కూడా అంతర్జాతీయంగా ఈ వారంలో 8 శాతం ఎగిశాయి.
Advertisement
Advertisement