
యువన్ శంకర్ రాజా
సరిగమలు పలకాల్సిన యువన్ శంకర్ రాజా స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. శృతి మీద వర్క్ చేయాల్సిన ఆయన స్క్రీన్‌ప్లే రెడీ చేస్తూ, బిజీగా ఉన్నారు. విషయమేంటంటే... ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ‘‘స్క్రిప్ట్ రాయడం కొత్త అనుభవం. ఫ్యాన్స్ నా నుంచి ఊహించని సినిమా ఇవ్వబోతున్నాను’’ అన్నారు యువన్. జర్మన్ సంగీత దర్శకుడు టామ్ టైక్వార్ రూపొందించిన ‘పెర్ఫ్యూమ్’ చిత్రమే యువన్ దర్శకుడిగా మారడానికి ఇన్‌స్పిరేషన్ అట.
Comments
Please login to add a commentAdd a comment