
తలకు, శరీరానికి చల్లదనం...
బ్యూటిప్
ఉసిరిక పొడి, కరివేపాకు, గోరింటాకు పొడి, నిమ్మరసం, కోడిగుడ్డు తెల్లసొన, టీ డికాషన్ తీసుకోవాలి. ఒక ఇనుప పాత్రలో ఈ పొడులన్నింటినీ వేసి టీ డికాషన్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నాననివ్వాలి. ఉదయం తలకు పట్టించడానికి అరగంట ముందు కోడిగుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలిపి తలకు అంటే జుట్టు కుదుళ్లకు అంటేటట్లు పట్టించాలి.
రెండు–మూడు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కేశాలు సిల్కీగా, ఒత్తుగా పెరుగుతాయి. జుట్టు పెరుగుదల పెంపొందుతుంది. తలకు, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. మంచినిద్ర పడుతుంది. జుట్టుకు మంచి పరిమళం వస్తుంది.