ఇదేం పెర్ఫ్యూమ్‌ రా బాబు..! కొనుగోలు చేస్తారా ఎవరైనా ..? | Dubai Princess Launches Perfume Line Called Divorce | Sakshi
Sakshi News home page

ఇదేం పెర్ఫ్యూమ్‌ రా బాబు..!కొనుగోలు చేస్తారా ఎవరైనా ..?

Sep 10 2024 4:15 PM | Updated on Sep 10 2024 4:23 PM

Dubai Princess Launches Perfume Line Called Divorce

పెర్ఫ్యూమ్‌ అంటే మంచి సువాసనభరితంగా చుట్టు ఉన్నవారిని తనవైపుకు ఆకర్షించేలా అటెన్ష్‌ తీసుకొస్తుంది. ఆ ఘుమాళింపు ముక్కుపుటలను తాకగానే అబ్బా అని మైమరచిపోయేలా ఉండే లగ్జరియస్‌ పెర్ఫ్యూమ్‌లను ప్రముఖ బ్రాండ్‌లు విడుదల చేస్తాయి. ఆ పేరుకి తగ్గ రేంజ్‌లోనే ఆ ఫెర్ఫ్యూమ్‌లు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఫెర్ఫ్యూమ్‌ పేరు వినగానే కళ్లెర్రజేయడం ఖాయం. ఛీ ఇదేం ఫెర్ఫ్యూమ్‌ ఆ పేరేంటి అని చిరాకు పడిపోతారు. చెప్పాలంటే ఇలాంటి ఫెర్ఫ్యూమ్‌ని ఎవ్వరైనా కొనే సాహసం చేస్తారా అనే సందేహం రాకుండా ఉండదు కూడా. ఏంటా ఫెర్ఫ్యూమ్‌ కథా కమామిషు అంటే..

దుబాయ్‌ రాజు కుమార్తె షేఖా మహ్రా అల్‌ మక్తూమ్‌ కొత్త పెర్ఫ్యూమ్‌ని టీచర్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ పెర్ఫ్యూమ్‌ని తన బ్రాండ్‌ మహ్రా ఎం పేరుతో విడుదల చేసింది. అది కాస్త సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం రేపి వివాదానికి దారితీసింది. ఆ టీజర్‌లో పెర్ఫ్యూమ్‌ పేరు "విడాకులు" అనే పదం చెక్కబడిన నల్లని సీసాపై ఉంది. విరిగిన గాజు, నల్లని చిరుతపులితో ఉండిన వీడియో వృత్తం 'డివోర్స్‌' ఇతి వృత్తాన్ని చెబుతున్నట్లుగా ఉంది. ఆ పెర్ఫ్యూమ్‌ లైన్‌ చూసి ఒక్కసారిగా నెటిజన్లు మండిపడ్డారు. 

ఒకరేమో మహ్రా చాలా తెలివిగా, గౌరవప్రదంగా వ్యాపారం ప్రారంభించిందని ప్రశంసించగా, చాలామంది మాత్రం భర్త నుంచి విడిపోయాననే బాధతో మరీ ఇలా చేస్తుందా..?, ఆమె చాలా క్రియేటివ్‌ అంటూ వెటకారంగా పోస్టులు పెట్టారు. అయితే ఆమె ఇస్లామిక్‌ పద్ధతిలో ఇన్‌స్టాలో తన భర్తకు బహిరంగంగా ట్రిపుల్‌ తలాక​ అని విడాకులు ఇచ్చిన కొన్నివారాల తర్వాత ఇలా యువరాణి మహ్రా వివాదాస్పదమైన విధంగా టీచర్‌ని విడుదల చేయడంతో ఇంతలా ఊహగానాలకు తెరలేపింది. 

దీంతో నెటిజన్లు విడాకుల గురించే సోషల్‌ మీడియాలో ప్రకటించాలనే ఉద్దేశ్యంతో ప్రత్యక్షంగా ఇలాంటి టీచర్‌ విడుదల చేసిందంటూ ఫైర్‌ అయ్యారు. కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని అయిన దుబాయ్‌ పాలకుడి కుమార్తె మహ్రా యూఏఈలో మహిళ సాధికారత, స్థానిక డిజైనర్ల తరుఫు న్యాయవాది.

 

(చదవండి: నటుడు కమలహాసన్‌ సరికొత్త బ్రాండ్‌​! జీరో వేస్ట్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement