ఆకట్టుకున్న పర్ఫ్యూమ్‌ మేకింగ్‌.. | Advanced Interior Perfume Products By Hans Grohe India | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న పర్ఫ్యూమ్‌ మేకింగ్‌..

Published Mon, Aug 5 2024 9:38 AM | Last Updated on Mon, Aug 5 2024 9:38 AM

Advanced Interior Perfume Products By Hans Grohe India

సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక ఇంటీరియర్‌ ఉత్పత్తులపై అవగాహన అందించేందుకు హన్స్‌ గ్రోహె ఇండియా ఆధ్వర్యంలో ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో ‘మేక్‌ ఇట్‌ యువర్స్‌’ పేరిట జరిగిన పర్ఫ్యూమ్‌ తయారీ కార్యక్రమం ఆకట్టుకుంది.

హాజరైనవారు తమకు నచ్చిన పరిమళాలను ఎంపికచేసుకుని పర్ఫ్యూమ్స్‌ను కస్టమైజ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అదే విధంగా బాత్‌రూమ్‌కు పర్యావరణ హితమైన రీతిలో థీమ్, ప్రశాంతత జతచేసి రూపొందించిన వినూత్న డిజైన్‌.. ది టీల్‌క్లబ్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. డ్రోన్‌ షో, డీజే మ్యూజిక్‌తో ఆకట్టుకున్న ఈ వెరైటీ ఈవెంట్‌కి నగరానికి చెందిన ఇంటీరియర్‌ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్‌ హాజరయ్యారు.

ఇవి చదవండి: ఇదీ.. లగ్గం లాగిన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement