Perfume designer
-
ఆకట్టుకున్న పర్ఫ్యూమ్ మేకింగ్..
సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక ఇంటీరియర్ ఉత్పత్తులపై అవగాహన అందించేందుకు హన్స్ గ్రోహె ఇండియా ఆధ్వర్యంలో ఐటీసీ కోహినూర్ హోటల్లో ‘మేక్ ఇట్ యువర్స్’ పేరిట జరిగిన పర్ఫ్యూమ్ తయారీ కార్యక్రమం ఆకట్టుకుంది.హాజరైనవారు తమకు నచ్చిన పరిమళాలను ఎంపికచేసుకుని పర్ఫ్యూమ్స్ను కస్టమైజ్ చేసుకునే అవకాశం కల్పించారు. అదే విధంగా బాత్రూమ్కు పర్యావరణ హితమైన రీతిలో థీమ్, ప్రశాంతత జతచేసి రూపొందించిన వినూత్న డిజైన్.. ది టీల్క్లబ్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. డ్రోన్ షో, డీజే మ్యూజిక్‌తో ఆకట్టుకున్న ఈ వెరైటీ ఈవెంట్‌కి నగరానికి చెందిన ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ హాజరయ్యారు.ఇవి చదవండి: ఇదీ.. లగ్గం లాగిన్! -
'డిజైనర్ హత్య.. లైంగికదాడి అనుమానం'
పుణె: గోవాలో ప్రముఖ పర్ఫ్యూమ్ డిజైనర్ మోనికా గర్డే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న ఆమెను గురువారం ఆమె ఇంటిపక్కన ఉన్నవాళ్లు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకున్నారు. దీంతోపాటు ఇంట్లోకి దోచుకోవడానికి వచ్చి ఆమెపై ఎవరైనా లైంగికదాడి చేసి ఈ హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా కేసులో పేర్కొన్నారు. 39 ఏళ్ల గర్డే పర్ఫ్యూమ్ డిజైనర్ గా పనిచేస్తోంది. ఆమెకు గురువారం తన సోదరుడు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటిపక్కన వారికి ఆ విషయం తెలియజేయగా వారి వద్ద అదనంగా ఉన్న తాళంతో తలుపు తెరిచి చూడగా గర్డే ప్రాణాలుకోల్పోయి పండి ఉంది. ప్రస్తుతానికి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పంపించారు. తొలుత ఫొటో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె అనంతరం మంచి ఫర్ఫ్యూమర్ గా, పరిశోధకురాలిగా మారింది.